సమాధిని సుందరీకరణ చేసిన దుండగులు.. ముఖ్యమంత్రి Eknath Shinde ఆగ్రహం

by Javid Pasha |   ( Updated:2022-09-09 06:11:30.0  )
సమాధిని సుందరీకరణ చేసిన దుండగులు.. ముఖ్యమంత్రి Eknath Shinde  ఆగ్రహం
X

దిశ, వెబ్‌డెస్క్: 1993 ముంబై బాంబ్ బ్లాస్ట్ దాడుల్లో నిందితుడైన యాకూబ్‌ను ఎక్స్‌క్యూట్ చేశారు. అయితే ముంబైలోని బడా కబరస్తాన్‌లో ఉన్న ఆ ప్రదేశాన్ని ఎవరో దుండగులు అద్భుతంగా సుందరీకరణ చేశారు. దీనిపై గురువారం మహారాష్ట్ర సీఎం ఏక్‌నాత్ షిండే స్పందించారు. ఈ దారుణానికి పాల్పడిన వారెవరైనా సరే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని, నిందితుడిని కుదిరినంత త్వరగా అదుపులోకి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

'యాకూబ్ సమాధి సుందరీకరణ ఘటనపై దర్యాప్తుకు ఆదేశాలివ్వడం జరిగింది. దర్యాప్తు కూడా ప్రారంభమైంది. ఇందుకు పాల్పడిన వ్యక్తిపై కఠిన చర్యలు తప్పకుండా తీసుకుంటాం' అని ఏక్‌నాథ్ షిండే వెల్లడించారు. అంతేకాకుండా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఆఫీసు నుంచి కూడా ఈ ఘటనపై తరువుగా విచారణ చేయాలని ముంబై పోలీసులు ఆదేశాలు అందుకున్నారు.

అయితే ఈ ఘటనపై మహారాష్ట్ర బీజేపీ నేత రాష్ట్ర మాజీ సీఎంను విమర్శించారు. బడా కబరస్తాన్‌లో ఉన్న యాకూమ్ మెమోన్ ఖనన ప్రాంతాన్ని మజార్‌గా మార్చే లైటింగ్ ఏర్పాట్లు రాష్టర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే దేశ బక్తి అని బీజేపీ నేత రామ్ కదమ్ విమర్శించారు. అనంతరం ఈ ఘటనపై ఉద్ధవ్ ఠాక్రే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. '1993 బాంబు పేలుళ్ల ఘటనలో దోషి అయిన పాకిస్తాన్ టెర్రరిస్ట్ యాకూబ్ మెమోన్ సమాధి ఉద్దవ్ ఠాక్రే సీఎంగా ఉన్నప్పుడు మజార్‌గా మార్చబడింది. ముంబై ఠాక్రేకు ఉన్న ప్రేమ ఇదే, ఆయన దేశ భక్తి ఇదేనా?' అని రామ్ కదమ్ ప్రశ్నించారు.

Advertisement

Next Story

Most Viewed