పుస్తకాల కాపీ రైట్‌కు పాల్పడితే కఠిన చర్యలు: ఎన్సీఈఆర్టీ వార్నింగ్

by samatah |
పుస్తకాల కాపీ రైట్‌కు పాల్పడితే కఠిన చర్యలు: ఎన్సీఈఆర్టీ వార్నింగ్
X

దిశ, నేషనల్ బ్యూరో: తమ పుస్తకాలను అనుమతి లేకుండా ముద్రిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) హెచ్చరించింది. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. కొంతమంది ప్రచురణకర్తలు ఎన్సీఈఆర్టీ నుంచి అనుమతి పొందకుండానే తమ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న పాఠశాల పాఠ్యపుస్తకాలను వారి సొంత పేరుతో ముద్రిస్తున్నారని పేర్కొంది. ఎన్సీఈఆర్టీ పాఠ్య పుస్తకాల్లోని కంటెంట్‌ను కాపీ రైట్ అనుమతి లేకుండా ప్రచురిస్తే 1957 కాపీరైట్ చట్టం ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఎన్సీఈఆర్టీకి సంబంధించిన పాఠ్యపుస్తకాలు లేదా వర్క్‌బుక్‌లను చూసిన వ్యక్తులు వెంటనే [email protected] ఈమెయిల్ ద్వారా తమకు సమాచారం అందించాలని సూచించింది.

ఇక, ఇటీవల సిలబస్‌లో మార్పులు చేసి తీసుకొస్తున్నా మూడో తరగతికి సంబంధించిన పాఠ్యపుస్తకాలు ఏప్రిల్ చివరి వారంలోగా, ఆరో తరగతికి పాఠ్యపుస్తకాలు మే నాటికి అందుబాటులో ఉంటాయని ఎన్సీఈఆర్టీ పేర్కొంది. ఈ తరగతులకు చెందిన పాఠ్యపుస్తకాల్లో ఎన్సీఈఆర్టీ పలు మార్పులు చేర్పులు చేసిన విషయం తెలిసిందే. ఈ సిలబస్ ప్రకారం అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేత, గుజరాత్‌లో ముస్లింల ఊచకోత, హిందుత్వ రాజకీయాలు వంటి అంశాలను పాఠ్యపుస్తకాల్లో పొందుపర్చారు.

Advertisement

Next Story