- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దేశ రాజధాని ఢిల్లీలో వింత ఘటన
దిశ, డైనమిక్ బ్యూరో: దేశ రాజధాని ఢిల్లీలో వింత ఘటన చోటుచేసుకుంది. 17 ఏళ్ల క్రితం (2006లో) కిడ్నాప్‌కు గురైన ఓ మహిళ ఆచూకీని ఢిల్లీ పోలీసులు ఎట్టకేలకు కనుగొన్నారు. మే 22న, సీమాపురి పోలీస్‌స్టేషన్‌కు అందిన రహస్య సమాచారంతో 17 సంవత్సరాల క్రితం కిడ్నాపైన 32 సంవత్సరాల (ప్రస్తుతం) మహిళను గుర్తించినట్లు డీసీపీ షాహదారా రోహిత్ మీనా గురువారం వెల్లడించారు. సదరు మహిళను పీఎస్‌కు తీసుకొచ్చిన పోలీసులు విచారణ జరిపారు. ఈ సందర్భంగా ఆమె పూర్తి వివరాలను వెల్లడించింది.
తాను ఇంటినుంచి వెళ్లిపోయాక, దీపక్ అనే వ్యక్తితో కలిసి ఉత్తరప్రదేశ్‌లోని బలియా జిల్లా చెర్దీ గ్రామంలో ఉన్నానని తెలిపింది. లాక్‌డౌన్ తర్వాత మనస్పర్థల కారణంగా దీపక్ నుంచి విడిపోయానని.. ఢిల్లీలోని గోకల్ పురిలో అద్దె ఇంట్లో ఉంటున్నానని చెప్పింది. మరోవైపు ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయిన తర్వాత ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో 2006లో ఐపీసీ 363 కింద పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు.