14 ఉత్పత్తుల విక్రయాలు నిలిపివేశాం.. సుప్రీంకోర్టుకు తెలిపిన పతంజలి

by Shamantha N |
14 ఉత్పత్తుల విక్రయాలు నిలిపివేశాం.. సుప్రీంకోర్టుకు తెలిపిన పతంజలి
X

దిశ, నేషనల్ బ్యూరో: పతంజలి ఆయర్వేద సంస్థ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. లైసెన్స్ రద్దు అయిన 14 రకాల ఉత్పత్తుల విక్రయాలు నిలిపివేశామని పేర్కొంది. అయితే, తప్పుదారి పట్టించే ప్రకటన కేసులో పతంజలి సంస్థ విచారణను ఎదుర్కొంటోంది. అందులో భాగంగానే ఈ విషయాన్ని కోర్టుకు తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న తమ ఫ్రాంచైజీ స్టోర్లకు ఉత్పత్తులను వెనక్కి పంపాలని ఆదేశాలు పంపామని పేర్కొంది. అలాగే వాటికి సంబంధించిన ప్రకటనలు నిలిపివేయాలని మీడియా సంస్థలకు కూడా సమాచారం ఇచ్చినట్లు తెలిపింది. తప్పుదోవ పట్టించేలా వాణిజ్య ప్రకటనలు ఇచ్చారని నిర్ధరణ అయిన పతంజలి ఉత్పత్తులపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ సంస్థకు చెందిన 14 రకాల ఉత్పత్తులపై నిషేధం విధించింది. అందులో భాగంగానే పతంజలి ఈ విధంగా స్పందించింది.

Advertisement

Next Story

Most Viewed