- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రామ శోభాయాత్రపైకి రాళ్ల దాడి.. ఉద్రిక్తత
by Hajipasha |
X
దిశ, నేషనల్ బ్యూరో : అయోధ్య రామమందిర ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం సాయంత్రం గుజరాత్‌లోని మెహసానా జిల్లా ఖేరాలు పట్టణంలో శ్రీరామ శోభా యాత్ర నిర్వహించారు. అయితే దీనిపైకి కొందరు అల్లరిమూకలు రాళ్లు రువ్వడం ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో యాత్రకు పహారా కాస్తున్న పోలీసులు మూడు భాష్పవాయువు షెల్స్‌ను అల్లరి మూకలపైకి ప్రయోగించారు. సంఘటనా స్థలంలో కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించి రాళ్లు రువ్విన ఘటనతో సంబంధమున్నట్లుగా అనుమానిస్తున్న పదిహేను మంది వ్యక్తులను పోలీసులు చుట్టుముట్టారు. రాళ్ల దాడిలో ఎవరికీ పెద్దగా గాయాలు కాలేదని ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వీరేంద్రసింగ్ యాదవ్ వెల్లడించారు. సంఘటనా స్థలంలో పరిస్థితి ప్రశాంతంగా ఉందని, ఆ ప్రాంతంలో పోలీసు పెట్రోలింగ్‌ను ముమ్మరం చేశామని చెప్పారు.
Advertisement
Next Story