మహారాష్ట్రలో కదులుతున్న రైలుపై రాళ్ల దాడి!.. వీడియో వైరల్

by Ramesh Goud |   ( Updated:2024-07-13 12:20:41.0  )
మహారాష్ట్రలో కదులుతున్న రైలుపై రాళ్ల దాడి!.. వీడియో వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కదులుతున్న రైలుపై ప్రజలు రాళ్లు రువ్విన ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహారాష్ట్రలోని జల్ గావ్ సమీపంలోని ఓ రైల్వే స్టేషన్ నుంచి రైలు ప్రయాణిస్తున్న తరుణంలో మార్గమధ్యంలో కొందరు రైలుపై రాళ్లు రువ్వడం ప్రారంభించారు. వారు ఆగ్రహావేశాలతో అరుస్తూ.. రైలుపై రాళ్లు విసిరారు. అయితే ఇందులో మహిళలు చిన్న పిల్లలు కూడా ఉండటం గమనార్హం. అకస్మాత్తుగా రైలుపై రాళ్లు పడటంతో రైలులోని ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వెంటనే కిటికీలు, డోర్లు మూసివేయడంతో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.

ఈ సంఘటనను రైలులో ఉన్న వ్యక్తులు వీడియో తీసి సామాజిక మాద్యమాల్లో పోస్ట్ చేశారు. దీనిపై అకస్మాత్తుగా రైలుపై రాళ్ల దాడి జరిగిందని, దీనికి కారణాలు తెలియదని, దీనిపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఘటనపై నెటిజన్లు స్పందిస్తూ.. ఇది మాములు సంఘటన కాదని, సమాజం యొక్క శాంతిభద్రతలను సవాలు చేసే సంఘటన అని, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చర్యలు చేపట్టాలని కామెంట్ల రూపంలో కోరుతున్నారు.

For Twitter Video : https://x.com/MrSinha_/status/1812042673588691432

Advertisement

Next Story
null