పాడైన పప్పు.. వాసన కొట్టే కర్రీ..! (వీడియో)

by GSrikanth |
పాడైన పప్పు.. వాసన కొట్టే కర్రీ..! (వీడియో)
X

దిశ, డైనమిక్ బ్యూరో: భారత్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వందే భారత్‌ ట్రైన్‌లో ఫుడ్ బాగాలేదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. రైల్వే క్యాటరింగ్‌ సర్వీస్ చేసే ఆహారపదార్థులు బాగోలేవని ప్రయాణికులు మండిపడుతున్నారు. ఇటీవల ఢిల్లీ నుంచి వారణాసి వెలుతున్న ఓ ప్రయాణికుడు ఫుడ్ వీడియో తీసి ఎక్స్ వేదికగా ఇండియన్ రైల్వేకు ఫిర్యాదు చేశారు. రైల్వే సిబ్బంది తీసుకువచ్చిన ఫుడ్‌ బాగాలేదని, పప్పు పాడైందని, కర్రీ కూడా వాసన కొడుతుందని ఆరోపణలు చేస్తూ ఫుడ్‌ను బోగిలోని అందరూ ప్రయాణికులు తినకుండా తిరిగి పంపించారు.

దీంతో డబ్బులు తమకు తిరిగి ఇవ్వాలని రైల్వేకు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రయాణికులకు నాణ్యమైన ఫుడ్ ఎప్పుడు పెట్టరని ఆరోపిస్తూ రైల్వే మంత్రిని విమర్శిస్తున్నారు. కాగా, ఈ వ్యవహారంపై రైల్వే స్పందించి చర్యలు చేపట్టింది.

Advertisement

Next Story