బడ్జెట్ కు ముందు రాష్ట్రపతి, కేంద్రమంత్రిల మధ్య స్పెషల్ మూమెంట్

by Shamantha N |   ( Updated:2024-02-01 07:21:27.0  )
బడ్జెట్ కు ముందు రాష్ట్రపతి, కేంద్రమంత్రిల మధ్య స్పెషల్ మూమెంట్
X

దిశ, నేషనల్ బ్యూరో: మధ్యంతర బడ్జెట్‌ ప్రవేశపెట్టే ముందు.. రాష్ట్రపతి ముర్ముతో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ భేటీ అయ్యారు. రాష్ట్రపతి ముర్ముతో నిర్మలాసీతారామన్ స్పెషల్ మూమెంట్ పంచుకున్నారు. నిర్మలా సీతారామన్ కు ముర్ము స్పూన్ తో స్వీట్ తినిపిస్తున్న ఫొటో వైరల్ గా మారింది. రాష్ట్రపతి భవన్ ఈ విజువల్స్ ని ట్విట్టర్ లో పంచుకుంది.

రాష్ట్రపతి భవన్ లో ముర్ముతో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ భేటీ అయ్యారు. ఇతర మంత్రులు డాక్టర్ భగవత్ కిషన్ రావ్ కరద్, పంకజ్ చౌదరి, ఆర్థిక మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. నిర్మలాసీతారామన్ ను ముర్ము అభినందించారు.

మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ రికార్డును సమం చేస్తూ శ్రీమతి సీతారామన్ వరుసగా ఆరో బడ్జెట్‌ను సమర్పించనున్నారు. ఆయన ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో.. దేశాయ్ 1959 నుంచి 1964 మధ్య ఐదు వార్షిక బడ్జెట్‌లు, ఒక మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు.

Advertisement

Next Story