తమిళనాడులో ఆలివ్ రిడ్లీ తాబేళ్ల కోసం ప్రత్యేక హేచరీలు

by Harish |   ( Updated:2024-03-13 10:09:37.0  )
తమిళనాడులో ఆలివ్ రిడ్లీ తాబేళ్ల కోసం ప్రత్యేక హేచరీలు
X

దిశ, నేషనల్ బ్యూరో: తమిళనాడులో ఆలివ్ రిడ్లీ తాబేళ్లు, వాటి పిల్లలను వాతావరణ మార్పుల ప్రతికూల ప్రభావాల నుంచి రక్షించడానికి హేచరీలను ఏర్పాటు చేశారు. తమిళనాడులో ఆలివ్ రిడ్లీ గూడు సీజన్ ఈ సంవత్సరం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో వీటి రక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి సుప్రియా సాహు తెలిపారు. 8 జిల్లాల్లోని 10 చోట్ల శీతోష్ణస్థితిని తట్టుకునే తాబేళ్ల హేచరీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ఆమె పేర్కొన్నారు.

ఎక్స్‌లో వ్యాఖ్యానించిన ఆమె, ఈ ఏడాది 9 జిల్లాలలో 45 హేచరీలను ఏర్పాటు చేయగా, దాదాపు 2 లక్షల 20 వేల గుడ్లు సురక్షితంగా సేకరించినట్లు తెలిపారు. ఇప్పటివరకు సేకరించిన గుడ్లలో ఇదే అత్యధికం. అటవీ శాఖ సిబ్బంది, వాలంటీర్లు గూడు కట్టుకున్న తాబేళ్లను, వాటి పిల్లలను తిరిగి సముద్రంలోకి సురక్షితంగా విడిచిపెట్టడానికి తమ వంతు కృషి చేస్తున్నారని ఆమె ఎక్స్‌లో పేర్కొన్నారు. ఆలివ్ రిడ్లీ తాబేలు, IUCN ప్రకారం అంతరించిపోయే ప్రమాదం ఉంది. వీటిని కాపాడటానికి తమిళనాడు తీర పునరుద్ధరణ మిషన్‌లో భాగంగా అక్కడి గ్రామాల్లో సముద్ర జీవులను, ముఖ్యంగా ఆలివ్ రిడ్లీ తాబేళ్లను రక్షించడం, వాటి ప్రాముఖ్యత గురించి మత్స్యకారులు, స్థానిక సంఘాలకు అవగాహన కల్పిస్తున్నారు.



Advertisement

Next Story

Most Viewed