- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Anjali Birla: స్పీకర్ ఓం బిర్లా కుమార్తె.. పరువు నష్టం దావా.. గూగుల్, ఎక్స్‌లకు హైకోర్టు కీలక ఆదేశాలు
దిశ, డైనమిక్ బ్యూరో: లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె, ఐఆర్‌పీఎస్ అధికారిణి అంజలి బిర్లా ఢిల్లీ హైకోర్టులో పరువు నష్టం దావా వేశారు. తనపై సోషల్ మీడియాలో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, ఆ పోస్టులను తొలగించాలని ఆమె హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే, ఇటీవల నీట్, యూజీ పేపర్ లీక్ అంశం తీవ్ర వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. దీంతో అంజలి బిర్లాపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర వివాదం చెలరేగింది. తన తండ్రి పలుకుబడిని ఉపయోగించి అంజలి తొలి ప్రయత్నంలో యూపీఎస్సీ పరీక్షల్లో పాసయ్యారంటూ సోషల్ మీడియాలో ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఆ నిరాధార పోస్టులను వెంటనే తొలగించేలా ఆదేశించాలంటూ అంజలి హైకోర్టును అభ్యర్థించారు. దీంతో న్యాయస్థానం ఆమెకు అనుకూలంగా స్పందిస్తూ తాజాగా తీర్పు ఇచ్చింది. ఆమె పరువుకు భంగం కలిగించేలా ఉన్న సోషల్ మీడియా పోస్టులను తొలగించాలని గూగుల్, ఎక్స్‌లకు హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. కాగా, వృత్తిరీత్యా మోడల్ అయిన అంజలి బిర్లా 2019లో యూపీఎస్సీ పరీక్షలు రాశారు. తొలి ప్రయత్నంలోనే ఆమె ఉత్తీర్ణత సాధించారు. అనంతరం 2021లో కమిషన్‌లో చేరారు.