మావోయిస్టులను తక్కువ అంచనా వేయడం లేదు.. ఎన్‌కౌంటర్‌పై కాంకేర్ SP కీలక ప్రకటన

by GSrikanth |
మావోయిస్టులను తక్కువ అంచనా వేయడం లేదు.. ఎన్‌కౌంటర్‌పై కాంకేర్ SP కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్‌కౌంటర్‌పై కాంకేర్ ఎస్పీ ఇందిరా కల్యాణ్ స్పందించారు. బుధవారం ఆయన ఓ మీడియా ఛానల్ ప్రతినిధితో మాట్లాడారు. ఎన్‌కౌంటర్‌లో మొత్తం 29 మంది మావోయిస్టులు మృతిచెందినట్లు తెలిపారు. దాదాపు నాలుగున్నర గంటల పాటు ఎన్‌కౌంటర్ జరిగింది.. ఇది చాలా పెద్ద ఎన్‌కౌంటర్ అని చెప్పారు. చనిపోయిన 29 మంది మావోయిస్టుల మృతదేహాలను రికవరీ చేసినట్లు వెల్లడించారు. ఇన్స్‌పెక్టర్ సహా ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలు అయ్యాయి. ఎన్‌కౌంటర్ జరిగిన ఘటనా స్థలంలో 60 నుంచి 70 మంది మావోయిస్టులు ఉన్నట్లు తెలిసింది.

కాల్పుల సమయంలో కొందరు తప్పించుకున్నారు. త్వరలో కొందరు సరెండర్ అవుతారని భావిస్తున్నామని ఎస్పీ అన్నారు. తాము మావోయిస్టులను తక్కువ అంచనా వేయడం లేదు. వాళ్లు ప్రతీకార చర్యలకు పాల్పడే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. అందుకే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. తాము మావోయిస్టుల సరెండర్‌పైనే ఎక్కువ ఫోకస్ పెట్టామని అన్నారు. సరెండర్ అయిన ఎవరికీ ఇబ్బంది లేకుండా చూసుకుంటాం.. పునరావాస కేంద్రాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ప్రస్తుతం కూడా కూంబింగ్ కొనసాగుతోందని అన్నారు.

Advertisement

Next Story