ఆ 12 రైళ్లు రద్దు.. దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన!

by Satheesh |   ( Updated:2023-06-03 08:38:50.0  )
ఆ 12 రైళ్లు రద్దు.. దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఒడిశాలో శుక్రవారం జరిగిన ఘోర రైలు ప్రమాదం కారణంగా పెద్ద సంఖ్యలో రైళ్లు రద్దయ్యాయి. రద్దైన రైళ్లలో తెలుగు రాష్ట్రాలకు వచ్చే రైళ్లు కూడా ఉన్నాయి. ఆపరేషనల్ కారణాల వల్ల విజయవాడ డివిషన్ మీదుగా వెళ్లే రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈరోజు నుంచి 9వ తేదీ వరకు 12 రైళ్లను రద్దు చేస్తున్నట్లు తెలిపింది.

ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించి రద్దైన ట్రైన్స్‌లో హౌరా-సికింద్రాబాద్(12703), షాలిమార్-హైద్రాబాద్(18045), హౌరా-తిరుపతి(20889) ఉన్నాయి. అంతేకాకుండా, విజయవాడ-రాజమండ్రి(07459), రాజమండ్రి-విజయవాడ(07460), రాజమండ్రి-విశాఖపట్నం(07466), విశాఖపట్నం- రాజమండ్రి(07467), కాకినాడ పోర్ట్ -విశాఖపట్నం(17267), విశాఖపట్నం- కాకినాడ పోర్ట్(17268), కాకినాడ పోర్ట్ -విజయవాడ(17258), విజయవాడ -కాకినాడ పోర్ట్(17257), గుంటూరు -విశాఖపట్నం(17239), విశాఖపట్నం -గుంటూరు(17240), విశాఖపట్నం- విజయవాడ(22701), విజయవాడ- విశాఖపట్నం(22702) ట్రైన్లను 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు రద్దు చేశారు.

అందుబాటులోకి హెల్ప్‌లైన్ నెంబర్లు..

ఒడిశా రైలు ప్రమాదం నేపథ్యంలో ప్రయాణికుల కుటుంబసభ్యులకు సహాయం చేసేందుకు దక్షిణ మధ్య రైల్వే హెల్ప్‌లైన్ నెంబర్లను అందుబాటులోకి తెచ్చింది. విజయవాడ- 0866 2576924, రాజమండ్రి- 08832420541, సామర్లకొట-7780741268, నెల్లూరు-08612342028, ఒంగోలు-7815909489, గూడురు-08624250795, ఏలూరు-08812232267 నెంబర్లను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఏపీకి చెందిన పలువురు ప్రయాణికులు కూడా ఈ ప్రమాదంలో ఉన్నట్లు తెలుస్తోంది. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో 70 మంది ఏపీ ప్రయాణికులు ఉన్నట్లు చెబుతున్నారు.

Read more: Coromandel express accident:14 ఏళ్ల క్రితం ఇదే శుక్రవారం.. అదే కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ విషాదం

Advertisement

Next Story