నితీష్ కొత్త ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంలుగా ఇద్దరు బీజేపీ నేతలు

by S Gopi |
నితీష్ కొత్త ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంలుగా ఇద్దరు బీజేపీ నేతలు
X

దిశ, నేషనల్ బ్యూరో: కూటమికి గుడ్‌బై చెప్పి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన నితీష్ కుమార్ బీజేపీతో కలిసి మరోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. నితీష్ కొత్త ప్రభుత్వంలో ఇద్దరు ఉప ముఖ్యమంత్రులుగా బీహార్ బీజేపీ చీఫ్ సామ్రాట్ చౌదరి, బీహార్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత విజయ్ సిన్హా ఈ బాధ్యతలను తీసుకుంటారని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ మేరకు బీహార్‌ బీజేపీ శాసనసభాపక్షం సమావేశమై వారిద్దరినీ ఎన్నుకుంది. నితీష్ కుమార్‌కి చెందిన జనతాదళ్ (యునైటెడ్)తో బీహార్ పొత్తును ఖరారు చేసేందుకు పార్టీ జాతీయ అధినేత జేపీ నడ్డా పాట్నాకు చేరుకుంటారు. ఇదివరకు రాష్ట్రంలో బీజేపీ, జేడీ(యూ) పొత్తు పెట్టుకున్నప్పుడు నితీష్‌ కుమార్‌కు డిప్యూటీగా ఉన్న బీజేపీ నేత సుశీల్‌ కుమార్‌ మోడీని మళ్లీ రాష్ట్రంలోకి తీసుకురావాలని కోరినట్లు నిన్న వార్తలు వచ్చాయి. సుశీల్ మోడీ బీహార్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, ముఖ్యమంత్రికి బహిరంగంగా మద్దతు తెలిపినందుకు నితీష్ కుమార్ మనిషిగా తరచూ ప్రతిపక్షాల నుండి ఆరోపణలు ఎదుర్కొన్నారు.

Advertisement

Next Story