ఎన్నికల వేళ సోనియా గాంధీ కీలక సందేశం.. మహిళలకు కీలక భరోసా!

by Ramesh N |   ( Updated:2024-05-13 20:42:48.0  )
ఎన్నికల వేళ సోనియా గాంధీ కీలక సందేశం.. మహిళలకు కీలక భరోసా!
X

దిశ, డైనమిక్ బ్యూరో: పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్ అగ్రనేత, సీపీపీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ కీలక సందేశం విడుదల చేశారు. నా ప్రియమైన సోదరీమణులారా.. స్వాతంత్ర్య పోరాటం నుంచి ఆధునిక భారతదేశ నిర్మాణం వరకు, మహిళలు అపారమైన సహకారం అందించారన్నారు. అయితే, నేడు మహిళలు తీవ్రమైన ద్రవ్యోల్బణం మధ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని తెలిపారు. వారి శ్రమకు, తపస్సుకు న్యాయం చేసేందుకు కాంగ్రెస్‌ విప్లవాత్మకమైన ముందడుగు వేసిందని వెల్లడించారు. కాంగ్రెస్‌ 'మహాలక్ష్మి' పథకం కింద నిరుపేద కుటుంబానికి చెందిన మహిళకు ప్రతి ఏడాది రూ. లక్ష అందజేస్తామన్నారు. మా హామీలు ఇప్పటికే కర్ణాటక, తెలంగాణలోని కోట్లాది కుటుంబాల జీవితాలను మార్చేశాయని వెల్లడించారు.

అది ఎంఎన్ఆర్ఈజీఏ, సమాచార హక్కు, విద్యా హక్కు లేదా ఆహార భద్రత.. కాంగ్రెస్ పార్టీ పథకాల ద్వారా లక్షలాది మంది భారతీయులకు బలాన్ని ఇచ్చిందన్నారు. తమ పనిని ముందుకు తీసుకెళ్లడానికి మహాలక్ష్మి తాజా హామీ అని తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో, కాంగ్రెస్ హస్తం మీతో ఉందని, ఈ చేయి మీ పరిస్థితిని మారుస్తుందని నేను మీకు హామీ ఇస్తున్నాను.. అని పేర్కొన్నారు.

Advertisement

Next Story