సభ నుంచి వెళ్లిపోయిన అఖిలేష్ యాదవ్.. కారణం ఇదే

by John Kora |
సభ నుంచి వెళ్లిపోయిన అఖిలేష్ యాదవ్.. కారణం ఇదే
X

బడ్జెట్ సెషన్ నుంచి విపక్షాల వాకౌట్

- మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు

- సభలోనే ఉన్న తృణమూల్ ఎంపీలు

దిశ, నేషనల్ బ్యూరో:

కేంద్ర బడ్జెట్ 2025ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెడుతున్నారు. అంతకు ముందు బడ్జెట్ ట్యాబ్‌ను తీసుకొని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వద్దకు వెళ్లి.. ఆమె అనుమతి తీసుకున్నారు. ఇక నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు విపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సభలోనే నినాదాలు చేశాయి. స్పీకర్ ఓం బిర్లా వారిని వారించడానికి ప్రయత్నించినా.. ఏ మాత్రం తగ్గలేదు. ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభ్‌లో ఇటీవల తొక్కిసలాట జరిగి 30 మంది భక్తుల చనిపోయారు. దీనిపై సభలో చర్చ పెట్టాలని సమాజ్‌వాది పార్టీ అధినేత, ఎంపీ అఖిలేశ్ యాదవ్ పట్టుబట్టారు. తన పార్టీ ఎంపీలతో కలసి నినాదాలు చేశారు. అయితే స్పీకర్ ఓం బిర్లా ఒప్పుకోకపోవడంతో అఖిలేష్ యాదవ్ తన ఎంపీలతో కలిసి సభ నుంచి వాకౌట్ చేశారు. అయితే వారితో కలిసి నినాదాలు చేసిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు మాత్రం సభలోనే ఉండిపోయారు.

మహాకుంభమేళాను బీజేపీ నేతృత్వంలోని యూపీ ప్రభుత్వం వీఐపీ కల్చర్‌లాగా మార్చేసిందని అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. సామాన్య ప్రజలు మహా కుంభమేళాలో పాల్గొనడానికి నానా కష్టాలు పడాల్సి వస్తుందని, వీఐపీలకే అధిక ప్రాధాన్యత ఇస్తుండటంతో సామాన్యులు అక్కడ పూజలు చేసేందుకు ఇబ్బందులు పడుతున్నరని అఖిలేష్ యాదవ్ పేర్కొన్నారు.

Next Story