- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Social media:16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్.. చట్టాన్ని ఆమోదించిన ఆస్ట్రేలియా
దిశ, నేషనల్ బ్యూరో: 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా (Social media) వాడకాన్ని నిషేధించే చట్టాన్ని ఆస్ట్రేలియా సెనేట్ (Australia senate) గురువారం ఆమోదించింది. దీంతో ఈ తరహా చట్టాన్ని తీసుకొచ్చిన ప్రపంచంలోనే మొదటి దేశంగా నిలిచింది. అంతకుముందు బుధవారం ఆస్ట్రేలియాలోని హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అధిక మెజారిటీతో బిల్లుకు ఆమోదం తెలిపింది. అయితే, సెనేట్‌లో చేసిన సవరణలను ప్రతినిధుల సభ ఇంకా ఆమోదించలేదు. ఈ సవరణలు ఆమోదం పొందుతాయని ప్రభుత్వం ఇప్పటికే అంగీకరించింది. ఈ చట్టం ప్రకారం 16 ఏళ్లలోపు పిల్లలు టిక్ టాక్ (Tik Tok), ఫేస్ బుక్ (Face book), స్నాప్ చాట్(Snap chat), రెడ్ ఇట్(Redit), ఎక్స్(X), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో అకౌంట్లు తెరవలేరు. తల్లిదండ్రులు సైతం తమ పిల్లలను ఈ ప్లాట్‌ఫారమ్‌లలో ఖాతాలను సృష్టించకుండా ఆపాలి. వారు ఈ తరహా చర్యలు తీసుకోకపోతే 33 మిలియన్ డాలర్ల వరకు జరిమానా విధించనున్నారు.
ఈ బిల్లుపై పలు పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయి. గ్రీన్స్ పార్టీ సభ్యుడు సెనేటర్ డేవిడ్ షూబ్రిడ్జ్ (David shoobridge) మాట్లాడుతూ.. ‘సోషల్ మీడియాను ఉపయోగించే పిల్లలకు ఈ నిషేధం ప్రమాదకరంగా మారుతుంది. ఒంటరిగా ఉండటం వల్ల మానసికంగా కుంగిపోయే అవకాశం ఉంది. ఈ విధానం ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపుతుంది’ అని తెలిపారు. పలు బాలల హక్కుల సంఘాలు సైతం దీనిని వ్యతిరేకించారు. అయితే తాజా కథనాల ప్రకారం, జనాభాలో 77శాతం మంది దీనిని అంగీకరించారు. కాగా, యూట్యూబ్ (Youtube)ని పాఠశాలల్లో ఉపయోగిస్తున్నందున దీనిని నిషేధం నుంచి మినహాయించారు.