కశ్మీర్‌లో ఆరుగురు ఉగ్రవాదులు హతం..రెండో రోజూ కొనసాగిన ఆపరేషన్

by vinod kumar |
కశ్మీర్‌లో ఆరుగురు ఉగ్రవాదులు హతం..రెండో రోజూ కొనసాగిన ఆపరేషన్
X

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూ కశ్మీర్‌లోని కుల్గామ్‌ జిల్లాలో వరుసగా రెండో రోజు కూడా భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ కొనసాగింది. మోడెర్గాం, ఫ్రీసల్ చిన్నిగాం గ్రామాల్లో టెర్రరిస్టుల కోసం జవాన్లు రెస్య్కూ ఆపరేషన్ చేపట్టారు. దీంతో రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారని, ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. శనివారం సాయంత్రం ప్రారంభమైన కాల్పులు ఆదివారం సాయంత్రం వరకు కొనసాగినట్టు వెల్లడించారు. మొదటి రోజు నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టగా రెండో రోజు కూడా ఇద్దరు ఉగ్రవాదులు మరణించినట్టు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కశ్మీర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆర్‌ఆర్ స్వైన్ మాట్లాడుతూ పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులను మట్టుబెట్టడం గొప్ప విజయమని అన్నారు. జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాద నిర్మూలన పోరాటం ముగింపు దశకు చేరుకుంటుందనడానికి ఈ ఆపరేషన్లే సూచిక అని కొనియాడారు. ఈ ప్రాంతాల్లో మరి కొందు ఉగ్రవాదులు కూడా ఉన్నట్టు సమాచారం అందిందని చెప్పారు. అయితే ఈ దాడుల వెనుక లష్కరే తోయిబా టెర్రిరిస్టు సాజిద్ ప్రమేయం ఉందని ఎన్ఐఏ భావిస్తోంది. మరోవైపు రాజౌరీ జిల్లా మంజాకోట్ ప్రాంతంలోని ఆర్మీ క్యాంపుపై ఉగ్రవాదులు దాడి చేయగా ఓ సైనికుడు గాయపడ్డట్టు తెలుస్తోంది.

Advertisement

Next Story