సిసోడియా భార్య పరిస్థితి విషమం.. సిసోడియా జైలు నుంచి వచ్చేసరికే ఆస్పత్రికి తరలింపు

by Mahesh |
సిసోడియా భార్య పరిస్థితి విషమం.. సిసోడియా జైలు నుంచి వచ్చేసరికే ఆస్పత్రికి తరలింపు
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కాంలో తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కు శుక్రవారం కోర్టులో ఊరట లభించింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సిసోడియా భార్యను చూసేందుకు కోర్టు అనుమతించింది. దీంతో సిసోడియా శనివారం ఉదయం ఆమెను చూసేందుకు ఇంటికి చేరుకున్నాడు కానీ అంతకు ముందు ఆమే ఆరోగ్యం క్షీనించడంతో ఆమెను ఎల్‌ఎన్‌జేపీ ఆస్పత్రిలో చేర్చారు. దీంతో మనీష్ సిసోడియా ఆయన భార్య సీమా సిసోడియాను కలవకుండానే వెనుదిరిగి వెళ్లాల్సి వచ్చింది అని ఆప్ నేత తెలిపారు. కాగా సీమా సిసోడియా గతకొంత కాలంగా మల్టిపుల్ స్క్లెరోసిస్‌తో బాధపడుతోంది.

Advertisement

Next Story