ఢిల్లీ లిక్కర్ స్కామ్: రౌస్ అవెన్యూ కోర్టుకు డిప్యూటి సీఎం మనీష్ సిసోడియా

by Satheesh |
ఢిల్లీ లిక్కర్ స్కామ్: రౌస్ అవెన్యూ కోర్టుకు డిప్యూటి సీఎం మనీష్ సిసోడియా
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ డిప్యూటి సీఎం మనీష్ సిసోడియాను సీబీఐ అధికారులు ఇవాళ మధ్యాహ్నం రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మనీష్ సిసోడియాను ఆదివారం దాదాపు 8 గంటల పాటు సుదీర్ఘంగా విచారించిన అనంతరం ఆయనను అరెస్ట్ చేస్తున్నట్లు సీబీఐ అధికారులు అధికారికంగా ప్రకటించారు. విచారణలో మనీష్ సిసోడియా సమాధానాలు సంతృప్తికరంగా లేవని.. విచారణకు సరిగ్గా సహకరించక పోవడంతోనే మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసినట్లు సీబీఐ తెలిపింది.

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కీలకమైన అంశాలపై మనీష్ సిసోడియా సరిగా సమాధానం ఇవ్వలేదని.. తప్పించుకునే విధంగా సమాధానాలు ఇచ్చారని, విరుద్ధమైన సాక్ష్యాలను ఎదుర్కొన్నప్పటికీ దర్యాప్తుకు సరిగ్గా సహకరించలేదని తెలిపారు. కాగా, ఈ కేసులో అరెస్ట్ అయిన దినేష్ అరోరా సహా ఇతర నిందితులతో ఉన్న సంబంధం, పలు ఫోన్‌ల నుంచి వచ్చిన సందేశాలు, వాటికి పంపిన రిప్లై.. ఎక్సైజ్ పాలసీలోని పలు అంశాలపై సిసోడియాను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. సిసోడియా నుంచి రాబట్టాల్సిన సమాచారం ఇంకా ఎంతో ఉందని, తమ కస్టడీకి ఇవ్వాలని కోర్టును సీబీఐ కోరనున్నట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed