బ్రేకింగ్: కర్నాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సిద్ధరామయ్య

by Satheesh |   ( Updated:2023-05-20 07:25:21.0  )
బ్రేకింగ్: కర్నాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సిద్ధరామయ్య
X

దిశ, డైనమిక్ బ్యూరో: కర్ణాటకలో నూతన ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా సిద్ధరామ్యయ, ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ లు ప్రమాణ స్వీకారం చేశారు. శనివారం బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో జరిగిన ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో వీరి చేత గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్ ప్రమాణ స్వీకారం చేయించారు. సిద్దరామయ్య కేబినెట్ లో ఎనిమిది మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అన్ని సామాజిక వర్గాలకు మంత్రి వర్గంలో చోటు కల్పించారు.

తొలికేబినెట్ లో ముగ్గురు దళితులకు అవకాశం కల్పించారు. కాగా మొత్తం ఎనిమిది మంది మంత్రుల్లో ఆరుగురు సిద్ధరామయ్య వర్గానికి చెందిన వారు ఒకరు మాత్రమే డీకే వర్గానికి చెందిన వారికి అవకాశం లభించింది. ఈ ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు బిహార్ సీఎం నితీష్ కుమార్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, ఛత్తీస్ గఢ్ సీఎం భూపేశ్ భగేల్, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోత్‌తో పాటు పలువురు జాతీయ నేతలు హాజరయ్యారు. పలువురు సినీ ప్రముఖులు సైతం ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

Advertisement

Next Story

Most Viewed