ఎల్‌టీటీఈకి షోకాజ్ నోటీస్..కారణమిదే?

by vinod kumar |
ఎల్‌టీటీఈకి షోకాజ్ నోటీస్..కారణమిదే?
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇటీవల పొడిగించిన ఐదేళ్ల నిషేధాన్ని నిర్ధారించే ప్రక్రియలో భాగంగా లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం(ఎల్‌టీటీఈ)కి చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) ట్రిబ్యునల్ షోకాజ్ నోటీసు జారీ చేసింది. సంస్థ చట్ట విరుద్ధమైందని ఎందుకు ప్రకటించకూడదో చెప్పాలని ఆదేశించింది. తమ అభ్యంతరాలపై సమాధానం ఇవ్వొచ్చని తెలిపింది. జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ సింగ్ అరోరాతో కూడిన ఢిల్లీ హైకోర్టు ట్రిబ్యునల్, నోటీసుపై స్పందించడానికి ఎల్‌టీటీఈకి 30 రోజుల గడువు విధించింది. కాగా, మే 14న ఎల్‌టీటీఈపై నిషేధాన్ని పొడిగిస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. 2009లో సైనిక పరాజయం పాలైన తర్వాత కూడా ఆ సంస్థ నిధుల సేకరణ, ప్రచార కార్యకలాపాలను రహస్యంగా నిర్వహిస్తోందని ఆరోపించింది. దాని మనుగడలో ఉన్న నాయకులు దానిని పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్నారని పేర్కొంది. దేశ సమగ్రత, భద్రతకు విఘాతం కలిగించే కార్యకలాపాలలో ఎల్‌టీటీఈ ఇప్పటికీ పాల్గొంటోందని అభిప్రాయపడింది. కార్యకర్తలను సమీకరించడానికి కృషి చేస్తోందని ఆరోపించింది.

Advertisement

Next Story

Most Viewed