‘నా కొడుకును కావాలనే ఇరికించారు’.. కోల్‌కతా నిందితుడి తల్లి షాకింగ్ కామెంట్స్!

by Jakkula Mamatha |   ( Updated:2024-08-24 05:57:45.0  )
‘నా కొడుకును కావాలనే ఇరికించారు’.. కోల్‌కతా నిందితుడి తల్లి షాకింగ్ కామెంట్స్!
X

దిశ,వెబ్‌డెస్క్:కోల్‌కత్తా ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, ఆపై హత్య ఘటన దేశవ్యాప్తంగా కుదిపేస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్, ఆర్జీ కర్ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ పై సీబీఐ దర్యాప్తు కొనసాగిస్తోంది. ఈ క్రమంలో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ తల్లి స్పందించారు. ఓ జాతీయ మీడియాకు ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎవరో తన కొడుకును కావాలనే ఇరికించారని, వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సంజయ్ రాయ్ క్రీడలపై ఆసక్తి కలిగి ఉన్న వ్యక్తి, బాక్సింగ్ నేర్చుకునేవాడు. అతను ఎన్‌సీసీ క్యాడెట్ అని చెప్పారు. చదువు పరంగా సంజయ్ స్కూల్ టాపర్‌గా నిలిచాడు.

నన్ను బాగా చూసుకునే వాడు అని ఆమె తెలిపారు. తన కుమారుడు ఆర్జీ కర్ హాస్పిటల్ లో పనిచేస్తున్నట్లు తెలియదన్నారు. అయితే ఈ ఘటన జరిగిన రాత్రి మాత్రం సంజయ్ భోజనం చేయలేదన్నారు. తన కుమారుడు రెడ్ లైట్ ఏరియాకు వెళ్లేవాడని వచ్చిన వార్తలను ఆమె తీవ్రంగా ఖండించారు. సంజయ్ మొదటి భార్య క్యాన్సర్‌తో మరిణించిందని చెప్పింది. అప్పటి నుంచి సంజయ్ రాయ్ మద్యానికి బానిస అయ్యాడని తెలిపింది. "నేను ఇంకా కఠినంగా ఉంటే ఇలా జరిగేది కాదు. తన తండ్రి చాలా కఠినంగా ఉంటాడు, నా భర్త మరణంతో, నా అందమైన కుటుంబం ఇప్పుడు జ్ఞాపకం మాత్రమే" అని ఆమె చెప్పింది. ఇలా చేయడానికి అతన్ని ఎవరు ప్రభావితం చేశారో నాకు తెలియదు. ఎవరైనా అతనిని ఇరికించినట్లయితే, ఆ వ్యక్తి శిక్షించబడతాడు అని ఆమె చెప్పింది.

Advertisement

Next Story