- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఎన్నికల వేళ ఎస్పీకి షాక్: ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి నిషాద్‌కు తీవ్ర అస్వస్థత
దిశ, నేషనల్ బ్యూరో: ఎన్నికల వేళ సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ)కి షాక్ తగిలింది. యూపీలోని గోరఖ్‌పూర్ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచిన ఆ పార్టీ అభ్యర్థి కాజల్ నిషాద్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు లక్నోలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. నిషాద్ రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నట్టు ఆమె భర్త సంజయ్ నిషాద్ వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల తేదీ ప్రకటించినప్పటి నుంచి కాజల్ నిషాద్ ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆరోగ్యం క్షీణించినట్టు తెలుస్తోంది. బీజేపీ సిట్టింగ్ ఎంపీ రవి కిషన్ శుక్లాపై నిషాద్ పోటీ చేస్తున్నారు.
కాగా, టీవీ నటి అయిన నిషాద్ 2021లో ఎస్పీ పార్టీలో చేరారు. అప్పటి నుంచి రాజకీయాల్లో ఆక్టివ్‌గా ఉన్నారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో కాపియర్‌గంజ్ అసెంబ్లీ స్థానం నుంచి ఎస్పీ తరఫున పోటీ చేయగా..ఓటమి పాలయ్యారు. అనంతరం గతేడాది గోరఖ్‌పూర్ మేయర్ పదవికి సైతం బరిలో నిలపగా ఓడిపోయింది. తాజాగా మరోసారి గోరఖ్ పూర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి ఎస్పీ ఎంపీ టికెట్ కేటాయించగా..అస్వస్థతకు గురికావడం గమనార్హం.