నాన్ వెజ్ ప్రియులకు షాక్.. చికెన్, మటన్, కబాబ్, ఫిష్ బిర్యానీలు బ్యాన్ చేసిన అధికారులు

by sudharani |
నాన్ వెజ్ ప్రియులకు షాక్.. చికెన్, మటన్, కబాబ్, ఫిష్ బిర్యానీలు బ్యాన్ చేసిన అధికారులు
X

దిశ, వెబ్‌డెస్క్: నాన్ వెజ్ ప్రియులకు అధికారులు భారీ షాక్ ఇచ్చారు. చికెన్, కబాబ్, ఫిష్ బిర్యానీలు బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించారు. అసలు విషయం ఏంటంటే.. బెంగుళూరు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు పెట్టింది పేరు. అక్కడ దాదాపుగా అన్ని ఏరియాస్‌లో చికెన్, మటన్ బిర్యానీ సెంటర్లు ఉంటాయి. చికెన్, మటన్, చేపలతో వివిధ రకాల వంటకాలు చేసి భారీగా విక్రయిస్తుంటారు. అయితే మార్చి 30వ తేదీన శ్రీరామనవమి కావడంతో బీబీఎంపీ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు మార్చి 30న ఎవరు మాసం విక్రయించకూడదని ఆదేశాలు జారీ చేశారు. అలా కాకుండా సిక్రెట్‌గా ఎవరైన విక్రయాలు జరిపితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Advertisement

Next Story