విపక్షాల మీటింగ్లో ఆ విషయాలు చర్చిస్తాం.. శివసేన (ఉద్ధవ్ థాక్రే వర్గం) ఎంపీ సంజయ్ రౌత్

by Javid Pasha |
ED Issues Notice To Sanjay Raut to attend questioning on Tuesday
X

దిశ, వెబ్ డెస్క్: ఈ నెల 17, 18 తేదీల్లో బెంగళూరులో జరగనున్న విపక్షాల మీటింగ్ పై శివసేన (ఉద్ధవ్ థాక్రే వర్గం) ఎంపీ సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. విపక్షాల సమేవేశంల అనేక విషయాలు చర్చకు వస్తాయని అన్నారు. ఈవీఎం మెషీన్లు, లోక్‌సభ సీట్ల పంపకం, ఫ్రంట్‌కి ఏ పేరు పెట్టాలి వంటి అనేక అంశాలపై చర్చ జరగనుందని తెలిపారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో 2004 నుంచి 2014 వరకు కొనసాగిన ప్రభుత్వంలో మిత్రపక్షాలన్నీ యూపీఏ కూటమిలో భాగస్వాములుగా ఉన్నాయి.

అయితే ఈసారి ఫ్రంట్ కు యూపీఏ కాకుండా మరేదైనా పేరును పెట్టాలా అనే విషయమై ఫ్రంట్ లోని రాజకీయ పార్టీలు నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కాగా ఇవాళ, రేపు బెంగళూరులో జరిగే విపక్షాల సమావేశానికి శివసేన (ఉద్ధవ్ థాక్రే వర్గం) నేతలు కూడా హాజరుకానున్నారు.

Advertisement

Next Story