ఆమె దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించాలి సోనియాగాంధీకి.. PM Modi బర్త్ డే విషెస్

by Hamsa |   ( Updated:2022-12-09 06:40:11.0  )
ఆమె దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించాలి సోనియాగాంధీకి.. PM Modi బర్త్ డే విషెస్
X

దిశ, డైనమిక్ బ్యూరో : కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు, యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (యూపీఏ) చైర్‌పర్సన్ సోనియా గాంధీ పుట్టిన రోజు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. 'సోనియాగాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆమె దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించాలని ప్రార్థిస్తున్నాను' అంటూ మోడీ ట్వీట్ చేశారు. అయితే, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో సాగుతున్న భారత్ జోడో యాత్రలో పాల్గొనేందుకు సోనియాగాంధీ నిన్న జైపూర్ చేరుకున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా సోనియాగాంధీ రణతంబోర్‌లోని షేర్‌బాగ్ హోటల్‌లో బస చేసినట్టు నేతలు తెలిపారు. కాగా, నేడు సోనియా గాంధీ తన పుట్టినరోజు వేడుకలను రణతంబోర్‌లో జరుపుకుంటారని వారు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో స్థానిక యంత్రాంగం అక్కడ అన్ని ఏర్పాట్లు చేసింది.

Read More....

BJP మాస్టర్ ప్లాన్.. మరోసారి తెలంగాణకు బీజేపీ అగ్రనేతలు!

Advertisement

Next Story