Shashi Tharoor: హర్యానాలో బీజేపీ లీడ్‌లోకి రావడం ఆశ్చర్యం.. శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు

by Shiva |   ( Updated:2024-10-08 08:49:21.0  )
Shashi Tharoor: హర్యానాలో బీజేపీ లీడ్‌లోకి రావడం ఆశ్చర్యం.. శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: హర్యానా (Haryana), జమ్ముకశ్మీర్‌ (Jammu & Kashmir)లో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా హర్యానా (Haryana)లో అనూహ్యంగా బీజేపీ (BJP) అధికారం కైవసం చేసుకునే దిశగా పరుగులు తీస్తోంది. ఉదయం నుంచి లీడ్‌లో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థులు ఒక్కసారిగా డీలా పడ్డారు. మొత్తం 90 స్థానాలకు గాను 47 స్థానాల్లో బీజేపీ (BJP) అభ్యర్థులు లీడ్‌లో ఉండగా.. కాంగ్రెస్ (Congress) 38 స్థానాల్లో, ఇతరులు (Others) 5 స్థానాల్లో ఆధిక్యతను కనబరుస్తున్నారు. తాజా సమాచారం మేరకు హర్యానాలో బీజేపీ గెలుపు నల్లేరు మీద నడకేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా హర్యానా (Haryana) ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ సీనియర్ ఎంపీ శశి థరూర్ (MP Shashi Tharoor) సంచలన వ్యాఖ్యలు చేశారు. అనూహ్యంగా బీజేపీ అభ్యర్థులు ఆధిక్యాన్ని కనబరుస్తుండటం తనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని అన్నారు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎవరూ ఎలాంటి నిర్ణయానికి రావడం సరికాదన్నారు. హర్యానా ట్రెండ్స్.. ఎగ్జిట్ పోల్స్ (Exit polls) వ్యవస్థ సిగ్గుపడేలా ఉన్నాయంటూ కామెంట్ చేశారు. అక్కడ ప్రజల్లో ప్రభుత్వం వ్యతిరేకత తీవ్రంగా ఉందని అన్నారు. ఎన్నికల ముందుకు హర్యానా (Haryana)లో తమదే అధికారం అనే ధీమాతో ఉన్నామని పేర్కొన్నారు. కానీ, అనూహ్యంగా ఫలితాలు తారుమారు అవ్వడం ఊహించలేని విషయమని శశి థరూర్ (Shashi Tharoor) పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed