Sharad pawar: శరద్ పవార్‌కు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత.. నిఘా వర్గాల హెచ్చరికలతో కేంద్రం నిర్ణయం !

by vinod kumar |
Sharad pawar: శరద్ పవార్‌కు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత.. నిఘా వర్గాల హెచ్చరికలతో కేంద్రం నిర్ణయం !
X

దిశ, నేషనల్ బ్యూరో: ఎన్సీపీ (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్‌కు కేంద్ర ప్రభుత్వం జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను కేటాయించింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసినట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు, అనేక ఇతర సమస్యల కారణంగా తలెత్తే పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అలాగే శరద్ పవార్ భద్రతపై నిఘా వర్గాలు సైతం ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రం ఆయనకు భద్రతను పెంచింది. దీంతో పది మంది సీఆర్‌పీఎఫ్ కమాండోలు పవార్‌కు భద్రతగా రానున్నారు. ప్రస్తుతం శరద్‌కు రాష్ట్ర ప్రభుత్వ జెడ్ ప్లస్ భద్రత ఉంది. త్వరలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అదనపు భద్రతను కేటాయించడం హాట్ టాపిక్‌గా మారింది. కాగా, దేశంలోని గౌరవ ప్రదమైన వ్యక్తులు, నాయకులు వారి ప్రాణాలకు ప్రమాదంలో ఉన్నప్పుడు జెడ్ ప్లస్ భద్రతను ఇస్తారు. ఈ భద్రత మంత్రులకు కల్పించే భద్రతకు భిన్నంగా ఉంటుంది.

Advertisement

Next Story