- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Sharad Pawar: పదవి కోసం కుటుంబాన్ని చీల్చుతావా?: అజిత్‌పై శరద్ పవార్ సీరియస్
దిశ, నేషనల్ బ్యూరో: ఎన్సీపీ(ఎస్పీ) చీఫ్ శరద్ పవార్(Sharad Pawar) మంగళవారం తన సోదరుడి కుమారుడు, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం(Maharashtra Deputy CM) అజిత్ పవార్(Ajit Pawar) పై విమర్శలు కురిపించారు. పదవి కోసం కుటుంబాన్ని చీల్చుతావా? అంటూ ఆగ్రహించారు. నాలుగు సార్లు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తించిన అజిత్ పవార్.. మరోసారి డిప్యూటీ సీఎం కుర్చీ కోసం పార్టీని చీల్చాడని విమర్శించారు. బారామతిలో మనవడు యుగేంద్ర పవార్ కోసం నిర్వహించిన ప్రచారంలో అజిత్ పవార్ పై మండిపడ్డారు. బారామతి అసెంబ్లీ నియోజకవర్గం(Baramati Assembly Constituency) నుంచి డిప్యూటీ సీఎం అజిత్ పవార్ పోటీ చేస్తున్నారు. ఇక్కడి నుంచి అజిత్ పవార్ బాబాయి కొడుకు యుగేంద్ర పవార్‌ను శరద్ పవార్ బరిలో నిలిపారు. బారామతిలో కుటుంబ సభ్యులు పోటీ పడే పరిస్థితి తలెత్తకుండా సీనియర్లు చూసుకోవాల్సిందని బారామతి ఎమ్మెల్యే అజిత్ పవార్ సోమవారం పేర్కొన్నారు.
నా తల్లిదండ్రులు, సోదరులు ఎన్నడూ కుటుంబాన్ని చీల్చే పాపాన్ని నాకు నేర్పలేదు... మహారాష్ట్రను లీడ్ చేసే బాధ్యతలను ప్రజలు నాకు ఎన్నడో ఇచ్చారు. నేను ఇప్పుడు ఒక మెంటర్‌ను. పార్టీ వ్యవహారాలను కొత్త తరానికి బదిలీ చేసే బాధ్యత నాపై ఉన్నది’ అని శరద్ పవార్ వివరించారు. ‘దురదృష్టవశాత్తు ఎన్సీపీ అధికారంలో లేనప్పుడు కొందరు నా మిత్రులు ఉన్నట్టుండి రాత్రిపూట మేలుకున్నారు, ప్రమాణం చేశారు. కానీ, ఆ ప్రభుత్వం కనీసం నాలుగు రోజులు కూడా నిలువలేదు. డిప్యూటీ సీఎం పదవి కోసం అజిత్ పవార్ ఇతరుల వైపు మళ్లాడు. ఆ పదవిని అప్పటికే నాలుగు సార్లు చేపట్టాడు. ఒక్కసారి ఆ పదవి దక్కనందుకు, కుటుంబాన్ని చీల్చుతావా?’ అంటూ శరద్ పవార్ విమర్శించారు. 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత అజిత్ పవార్ కొంత మంది ఎమ్మెల్యేలను వెంటపెట్టుకుని సీఎంగా ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంగా అజిత్ ప్రమాణం చేశారు. కానీ, ఆ ప్రభుత్వం నాలుగు రోజులు కూడా నిలువలేదు.