- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Sharad pawar: ఇక ఎన్నికల్లో పోటీ చేయబోను.. శరద్ పవార్ సంచలన ప్రకటన
దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ ఎన్సీపీ(ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ (Sharad pawar) సంచలన ప్రకటన చేశారు. ఇప్పట్లో ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయబోనని స్పష్టం చేశారు. పార్టీ సంస్థాగత పనులను మాత్రం కొనసాగిస్తానని చెప్పారు. తాను పార్లమెంటరీ రాజకీయాల(Parlamentary Politics) కు దూరంగా ఉండొచ్చని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మంగళవారం బారామతి (Baramathi) నియోజకవర్గంలో జరిగిన సభలో ప్రసంగించారు. తన రాజ్యసభ(Rajya sabha) పదవీకాలం ఇంకా ఏడాదిన్నర ఉందని, ఇది ముగిసిన తర్వాత మరో సారి సభకు వెళ్లాలా వద్దా అనే దానిపై నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. లోక్ సభకు మాత్రం పోటీ చేయబోనని తేల్చి చెప్పారు. ‘నేను ఇక ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయదలచుకోలేదు. ఎలక్షన్స్‌కు సంబంధించిన ప్రక్రియ ఆపాలి. కొత్త తరం ముందుకు రావాలి. ఇప్పటి వరకు 14 సార్లు ఎన్నికల్లో పోటీ చేశా. నాకు అధికారం అక్కర్లేదు. సమాజం కోసం మాత్రమే పని చేయాలనుకుంటున్నా’ అని వ్యాఖ్యానించారు.
ఇప్పటి వరకు 14 సార్లు పోటీ చేసినా ఒక్కసారి కూడా ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టలేదని తెలిపారు. కానీ ఎక్కడో ఒక చోట విరామం తప్పదని చెప్పారు. బారామతిలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్(Ajith pawar) చేసిన కృషిని ప్రశంసించిన శరద్.. రాబోయే మూడు దశాబ్దాల పాటు ఈ ప్రాంత అభివృద్ధికి కొత్త నాయకత్వం అవసరమని నొక్కి చెప్పారు. 30 ఏళ్లు పనిచేసే నాయకత్వాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం ఉత్కంఠగా కొనసాగుతున్న వేళ శరద్ పవార్ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. అయితే మహారాష్ట్రలోనే గాక జాతీయ రాజకీయాల్లోనూ పవార్ కీలక పాత్ర పోషించారు. ఒక వేళ ఆయన పార్లమెంటరీ రాజకీయాల నుంచి తప్పుకుంటే మహారాష్ట్ర పాలిటిక్స్‌పై తీవ్ర ప్రభావం పడే చాన్స్ ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.