Sharad pawar: మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని మార్చాల్సిందే.. ఎన్సీపీ (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్

by vinod kumar |
Sharad pawar: మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని మార్చాల్సిందే.. ఎన్సీపీ (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలంటే మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని మార్చాల్సిందేనని ఎన్సీపీ (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ (Sharad pawar) స్పష్టం చేశారు. రైతులు, మహిళలు, యువత భవిష్యత్ మారాలంటే ప్రభుత్వం మారాల్సిందేనని తేల్చిచెప్పారు. జల్గావ్ జిల్లాలోని పరోలాలో సోమవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలకు సెక్యూరిటీ కల్పించాల్సింది పోయి లడ్కీ బహిన్ ద్వారా వారికి డబ్బు అందిస్తున్నారన్నారు. ప్రభుత్వం చేంజ్ అయ్యే వరకు ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పూ ఉండబోదన్నారు. మహావికాస్ అఘాడీ (MVA) కూటమిలో భాగస్వామిగా ఉన్న శివసేన(UBT), కాంగ్రెస్, ఎన్సీపీ(sp)లు ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని, అందుకు ప్రజలు మద్దతివ్వాలని కోరారు. మార్పు తీసుకురావడం ఏ ఒక్కరిలో సాధ్యం కాదని ఐక్యంగా ఉంటేనే సాధ్యమవుతుందని చెప్పారు. ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ రాకుండా చేయడం ద్వారా రాజ్యాంగాన్ని మార్చాలన్న ప్రధాని మోడీ ఆలోచనలను ఇండియా కూటమి తుంగలో తొక్కిందని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed