- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉద్ధవ్ ఠాక్రెకు జరిగిన ద్రోహానికి మహారాష్ట్ర ప్రజలు బాధపడ్డారు: శంకరాచార్య
దిశ, నేషనల్ బ్యూరో: శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేకు ద్రోహం జరిగిందని జ్యోతిర్మఠానికి చెందిన శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద అన్నారు. ఆయన మళ్లీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యే వరకు తన నొప్పి తగ్గదని అభిప్రాయపడ్డారు. సోమవారం ముంబైలోని ఉద్ధవ్ ఠాక్రె నివాసం మాతోశ్రీలో అవిముక్తేశ్వరానంద సరస్వతి పూజలు నిర్వహించారు. ఉద్ధవ్ ఠాక్రే దంపతులను ఆశీర్వదించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మనందరం హిందూ మతాన్ని అనుసరించేవాళ్లం. పాపం, పుణ్యాలను విశ్వసిస్తాం. ద్రోహం అనేది అతిపెద్ద పాపం. ఉద్ధవ్ ఠాక్రెకు అదే జరిగిందని అవిముక్తేశ్వరానంద అన్నారు. ఈ సందర్భంగా శివసేన పార్టీని ఏక్‌నాథ్ షిండే చీల్చడం ద్వారా సీఎం పదవికి బలవంతంగా రాజీనామా చేసిన ఉద్ధవ్ ఠాక్రేకు సంఘీభావం తెలిపారు. తాను ఎదుర్కొన్న ద్రోహానికి మనమందరం బాధపడ్డామని, తనతో చెప్పాను. ఆయన మళ్లీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యే వరకు మా బాధలు తీరవని అవిముక్తేశ్వరానంద అన్నారు. మోసం చేసే వ్యక్తి హిందువు కాలేడని, మహారాష్ట్ర ప్రజలు ద్రోహానికి గురవుతున్నారని ఎన్నికల ఫలితాల్లోనూ స్పష్టమైందని పేర్కొన్నారు.