నా తండ్రి కూడా నన్ను లైంగికంగా వేధించేవాడు

by S Gopi |   ( Updated:2023-03-11 15:42:05.0  )
నా తండ్రి కూడా నన్ను లైంగికంగా వేధించేవాడు
X

న్యూఢిల్లీ: తన తండ్రి బాల్యంలో తనను లైంగికంగా వేధించేవాడని ఢిల్లీ ఉమెన్ ప్యానెల్ చీఫ్ స్వాతి మలివాల్ ఆరోపించారు. స్టెయిన్ ఆడిటోరియంలో డీసీడబ్లూ శనివారం నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘చిన్న తనంలో నా తండ్రి నన్ను లైంగికంగా వేధింపులకు గురిచేసేవారు. అంతేగాక అకారణంగా కొట్టేది. జుట్టు పట్టుకుని గోడకు గట్టిగా బాదేది. ఆయన ఇంట్లోకి రాగానే భయపడి ఎన్నోసార్లు నన్ను నేను రక్షించుకోవడానికి బెడ్ కింద దాక్కునే దాన్ని’ అని తెలిపారు. అయితే ఆ సమయంలో మహిళా హక్కులపై ఎలా పోరాడాలి, వారిని ఎలా శక్తివంతులను చేయాలనే దాని గురించే ఆలోచించేది అని అన్నారు. కాగా, సినీనటి ఖుష్బూ సైతం ఇటీవల తన తండ్రిపై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story