- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
పెను తుఫాన్.. 34 మంది మృత్యువాత

దిశ, వెబ్ డెస్క్: అమెరికాలో (America) పెను తుఫాన్ (Storm) బీభత్సం సృష్టించింది. పలు రాష్ట్రాల్లో టోర్నడోలు (Tornadoes) విరుచుకుపడటంతో 34 మంది మృతి చెందారు. ఇళ్లు, దుకాణాలు, స్కూళ్లు, కార్యాలయాలు, రోడ్లు భారీగా ధ్వంసమయ్యాయి. మిస్సోరీలో 12 మంది మృతి చెందగా అనేక మంది గాయపడ్డారు. ఆర్కన్సాస్‌లో ముగ్గురు మృతి చెందగా, 29 మందికి పైగా గాయపడ్డారు. అలాగే, కాన్సాస్‌లో ఎనిమిది మంది, మిస్సిస్సిప్పీలో ఆరుగురు మృతి, టెక్సాస్‌లో నలుగురు మరణించారు. కెనడా నుంచి టెక్సాస్ వైపునకు గంటకు 130 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఓక్లహోమా, మిస్సోరీ, న్యూ మెక్సికో, టెక్సాస్, కాన్సస్‌లలో కార్చిచ్చులు చెలరేగడంతో ఆయా ప్రాంతాల నుంచి ఖాళీ చేయాలని నివాసితులను ఆదేశించింది. మరోవైపు మిన్నెసొటా, సౌత్ డకోటాలోని కొన్ని ప్రాంతాలకు మంచు తుపాను ముప్పు పొంచి ఉందని వాతావరణ అధికారులు హెచ్చరించారు. మార్చిలో ఇలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులు సాధారణమే అని, అయితే.. ఈసారి విస్తృతి, తీవ్రత అధికంగా ఉందని జాతీయ వాతావరణ సేవల విభాగం నిపుణులు తెలిపారు.