Serum Institute: త్వరలోనే మంకీపాక్స్‌కు వ్యాక్సిన్.. సీరం ఇన్ స్టిట్యూట్ సీఈఓ అదార్ పూనావాలా

by vinod kumar |
Serum Institute: త్వరలోనే మంకీపాక్స్‌కు వ్యాక్సిన్.. సీరం ఇన్ స్టిట్యూట్ సీఈఓ అదార్ పూనావాలా
X

దిశ, నేషనల్ బ్యూరో: కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్‌ టీకాను తయారు చేసిన సీరమ్ ఇన్‌స్టిట్యూట్ మంకీపాక్స్ వ్యాధికి సైతం వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయనున్నట్టు ప్రకటించింది. వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడానికి ప్రస్తుతం కృషి చేస్తున్నామని, ఏడాది వ్యవధిలో సానుకూల ఫలితాలు వస్తాయని కంపెనీ సీఈఓ అదార్ పూనావాలా మంగళవారం తెలిపారు. అనేక మంది ప్రజలకు సహాయం చేయడానికి ఈ వ్యాక్సిన్ ఎంతో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. ఏడాది వ్యవధిలోనే దీనికి అనుకూలంగా రిజల్ట్ వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో అకస్మాత్తుగా మంకీపాక్స్ కేసులు నమోదైన నేపథ్యంలో ఈ నెల14న ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం సైతం దీనిపై సమీక్ష నిర్వహించి వైద్య సిబ్బందిని అప్రమత్తం చేసింది. అయితే ప్రస్తుతం భారత్‌లో మంకీపాక్స్ కేసులు వెలుగు చూడలేదు. ఈ ఏడాది మార్చిలో చివరి కేసు నమోదైంది.

Advertisement

Next Story