సంచలనం: కనిపిస్తే కాల్చి వేయాలని గవర్నర్ ఆదేశం

by GSrikanth |   ( Updated:2023-05-06 09:39:14.0  )
సంచలనం: కనిపిస్తే కాల్చి వేయాలని గవర్నర్ ఆదేశం
X

దిశ, వెబ్‌డెస్క్: మణిపూర్ రాష్ట్రంలోని చురాచాంద్‌పూర్ జిల్లా అల్లర్లతో అట్టుడుకుతోంది. పరిస్థితి ఎంతకీ అదుపులోకి రాకపోవడంతో పోలీసులు కఠినమైన ఆంక్షలు విధించారు. జిల్లా వ్యాప్తంగా కర్ఫ్యూ విధించారు. కంగ్వాల్, టుయుబాంగ్, చురచంద్‌పూర్ సబ్ డివిజన్‌లకు ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేశారు. మణిపూర్‌లోని 8 జిల్లాల్లో కర్యూ విధించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో మొబైల్, ఇంటర్నెట్ సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు. మరోవైపు, ఉద్రిక్తత దృష్ట్యా బిష్ణుపూర్ జిల్లాలో తక్షణమే 144 సెక్షన్ అమలు చేశారు. ఇక్కడ ఐదు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడకుండా నిషేధించారు.

అయినా.. అక్కడక్కడ కొన్నచోట్ల అలర్లు ఆగకపోవడంతో రాష్ట్ర గవర్నర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రోడ్డుమీద అల్లరి మూకలు కనిపిస్తే కాల్చి వేయాలని గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. కాగా, షెడ్యూల్డ్ తెగ (ST) హోదా కోసం ఇంఫాల్ లోయలో ఆధిపత్యం చెలాయించే గిరిజనేతర మైటీస్ డిమాండ్‌ను నిరసిస్తూ చురచంద్‌పూర్ జిల్లాలోని టోర్‌బంగ్ ప్రాంతంలో ఆల్ ట్రైబల్ స్టూడెంట్ యూనియన్ మణిపూర్ (ATSUM) పిలుపునిచ్చిన 'గిరిజన సంఘీభావ యాత్ర'లో హింస చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే హింసాత్మతక ఘటనలు చోటు చేసుకోవడంతో ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి.

Advertisement

Next Story

Most Viewed