కర్ణాటకలో బీజేపీకే లింగాయత్‌ల మద్దతు..!

by Mahesh |   ( Updated:2023-04-19 13:33:10.0  )
కర్ణాటకలో బీజేపీకే లింగాయత్‌ల మద్దతు..!
X

దిశ, డైనమిక్ బ్యూరో: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పావులు కదుపుతున్నాయి. ఈ స్టేట్‌లో లింగాయత్ కమ్యూనిటీ ఓటర్లే కింగ్ మేకర్లుగా ఉన్న నేపథ్యంలో ఈ సారి వారి మద్దతు ఎటు వైపు అనేదానిపై ఆసక్తికర చర్చ జరుగుతున్న వేళ మూరుసావీర్ మఠానికి చెందిన గురు సిద్ధ రాజయోగీంద్ర స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. లింగాయత్‌లందరి మద్దతు బీజేపీకేనని స్పష్టం చేశారు. గత రెండు సార్లు లింగాయత్ లు బీజేపీకి అండగా నిలిచారని ఈసారి కూడా తమ మద్దతు బీజేపీకే ఉంటుందని భావిస్తున్నట్లు చెప్పారు.

హుబ్లీ- ధార్వాడ్ సెంట్రల్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి మహేష్ టెంగింకై మంగళవారం మఠాన్ని సందర్శించి మఠాధిపతి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా గురు సిద్ధ రాజయోగీంద్ర స్వామి మాట్లాడుతూ.. పై వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే కన్నడ నాట లింగాయత్ ఓటర్లను ఆకర్షించేలా సీఎం బసవరాజ్ బొమ్మై కంటే లింగాయత్ కమ్యూనిటీకి చెందిన యడ్యూరప్పను పార్టీ అధిష్టానం అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఈ నేపథ్యంలో గురు సిద్ధ రాజయోగీంద్ర స్వామి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

Advertisement

Next Story