ఉదయనిధి స్టాలిన్ తల నరికితే పది కోట్లు: అయోధ్య సాధువు సంచలన ప్రకటన

by Satheesh |   ( Updated:2023-09-04 14:10:36.0  )
ఉదయనిధి స్టాలిన్ తల నరికితే పది కోట్లు: అయోధ్య సాధువు సంచలన ప్రకటన
X

దిశ, డైనమిక్ బ్యూరో: స‌నాత‌న ధ‌ర్మాన్ని నిర్మూలించాల‌ని త‌మిళ‌నాడు సీఎం కొడుకు, మంత్రి ఉద‌య‌నిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విష‌యం తెలిసిందే. దీంతో ఆయనపై బీజేపీ, హిందూ సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉదయనిధి స్టాలిన్ తల నరికి తెస్తే రూ. 10 కోట్లు ఇస్తానని అయోధ్య సాధువు పరమహంస ఆచార్య ఇవాళ సంచలన ప్రకటన చేశారు. ఎవరు ఆ పని చేయకుంటే తానే స్వయంగా ఉదయనిధి స్టాలిన్ తల నరికేస్తానని అన్నారు.

మరోవైపు స్టాలిన్ ఫొటోను కత్తితో పొడుస్తూ కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరోవైపు సోషల్ మీడియాలో ఉదయనిధి స్టాలిన్‌పై నెటిజన్లు తీవ్రస్థాయిలో విరుచుకపడుతున్నారు. కాగా, ఆ మాటలకు నేను కట్టుబడి ఉన్నానని న్యాయపరంగా సవాళ్లు ఎదుర్కునేందుకు సిద్దంగా ఉన్నానని ఉదయనిధి స్టాలిన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story