కర్ణాటకలో జేడీఎస్‌కు షాక్.. పార్టీ సీనియర్ నేత రాజీనామా

by Vinod kumar |
కర్ణాటకలో జేడీఎస్‌కు షాక్.. పార్టీ సీనియర్ నేత రాజీనామా
X

బెంగళూరు: కర్ణాటకలో ఎన్నికలకు ముందు జనతా దళ్ సెక్యూర్‌కు షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్యే ఏటీ రామస్వామి తన సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు అసెంబ్లీ సెక్రటరీకి తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. తన పదవికి సంతోషంగా రాజీనామా చేస్తున్నానని చెప్పారు. స్పీకర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత తన విజ్ఞప్తిని ఆమోదించమని కోరనున్నట్లు చెప్పారు. అయితే తాను జేడీఎస్ నుంచి వెళ్లిపోవట్లేదని.. వారే బలవంతంగా పంపిస్తున్నారని అన్నారు.

ధన రాజకీయానికి బాధితుడినని తెలిపారు. భవిష్యతు కార్యచరణపై త్వరలోనే వెల్లడిస్తానని అన్నారు. అన్ని పార్టీల నేతలతో తనకు కాంటాక్ట్‌లు ఉన్నాయని చెప్పారు. అయితే తాను ఏ పార్టీలో చేరబోయేది మాత్రం స్పష్టత ఇవ్వలేదు. కాగా, హసన్ జిల్లాలోని అర్కల్గుడ్ నియోజకవర్గం నుంచి రామస్వామి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. గత కొన్ని రోజులుగా పార్టీ నాయకత్వంతో రామస్వామికి విబేధాలు తలెత్తాయి. ఈ క్రమంలో రాబోయే ఎన్నికల్లో కింగ్ మేకర్ కావాలనుకుంటున్న జేడీఎస్ పై ఇది ప్రభావం చూపే అవకాశం ఉంది.

Advertisement

Next Story