రాజస్థాన్‌లో తొలి వందే భారత్ ట్రైన్‌ను ప్రారంభించిన ప్రధాని..

by Vinod kumar |
రాజస్థాన్‌లో తొలి వందే భారత్ ట్రైన్‌ను ప్రారంభించిన ప్రధాని..
X

జైపూర్: రాజస్థాన్‌లో తొలి వందే భారత్ ట్రైన్‌ను బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్‌గా ప్రారంభించారు. పార్టీలో సంక్షోభ పరిస్థితులు నడుమ కూడా సీఎం అశోక్ గెహ్లట్ కార్యక్రమంలో పాల్గొన్నారని అన్నారు. అభివృద్ధి పనుల కోసం సమయాన్ని వెచ్చించి రైల్వే కార్యక్రమంలో పాల్గొన్న ఆయనకు ప్రత్యేక అహ్వానం పలుకుతున్నట్లు చెప్పారు. స్వార్థ పూరిత రాజకీయాలు భారత రైల్వేల అధునీకరణను ఆలస్యం చేశాయని గత ప్రభుత్వాలపై మండిపడ్డారు. 2014 తర్వాతే సంస్కరణ మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పారు.

రైల్వే మంత్రిగా ఉన్న వ్యక్తి రాజకీయ ప్రయోజనాల గురించి ఆలోచించారని మాజీ కేంద్ర మంత్రి లాలూ యాదవ్ పై పరోక్షంగా విమర్శలు చేశారు. పేదల భూములు లాక్కొని వారికి ఉద్యోగాలు ఇచ్చారన్నారు. వందే భారత్ రైళ్లు అభివృద్ధి, అధునీకరణ, సుస్థిరతకు మారుపేరుగా మారాయని చెప్పారు. ప్రారంభించిన తర్వాత నుంచి ఇప్పటి వరకు 60 లక్షల మందికిపైగా రైళ్లలో ప్రయాణించినట్లు చెప్పారు. ప్రజల సమయాన్ని ఆదా చేయడం వందే భారత్ అతిపెద్ద ఫీచర్ అని చెప్పారు. జైపూర్ నుంచి ఢిల్లీ మధ్య నడిచే ఈ రైలు టూరిజం రంగానికి దోహదపడుతుందని తెలిపారు. కాగా, ఇది దేశంలో ప్రారంభించిన 15వ రైలు కావడం గమనార్హం.

Advertisement

Next Story