Salman Khan: క్షమాపణలు చెప్పు లేదా రూ.5 కోట్లు చెల్లించు.. సల్మాన్ కు మరోసారి బెదిరింపులు

by Shamantha N |
Salman Khan: క్షమాపణలు చెప్పు లేదా రూ.5 కోట్లు చెల్లించు.. సల్మాన్ కు మరోసారి బెదిరింపులు
X

దిశ, నేషనల్ బ్యూరో: బాలీవుడ్‌ స్టార్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ (Salman Khan)కు మరోసారి బెదిరింపులు (fresh threat) వచ్చాయి. గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ (Larence Bishnoi gang) నుంచి ఫ్రెష్ థ్రెట్స్ వచ్చినట్లు తెలుస్తోంది. లారెన్స్ సోదరుడిగా చెప్పుకుంటూ ఓ వ్యక్తి నుంచి ముంబై పోలీస్ ట్రాఫిక్ కంట్రోల్ యూనిట్ కు సోమవారం మెసేజ్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. కృష్ణ జింకను చంపినందుకు సల్మాన్‌ ఆలయాన్ని సందర్శించి క్షమాపణలు చెప్పాలని (forgiveness at temple).. లేదంటే రూ.5 కోట్లు చెల్లించాలని డిమాండ్‌ చేసినట్లు వెల్లడించారు. ‘సల్మాన్ ఖాన్ బతికి ఉండాలంటే గుడికి వెళ్లి క్షమాపణ చెప్పాలి. లేదా రూ. 5 కోట్లు చెల్లించాలి. అలా చేయకుంటే అతడ్ని చంపేస్తాం. మా గ్యాంగ్ యాక్టివ్ గానే ఉంది’ అని బిష్ణోయ్‌ గ్యాంగ్‌ నుంచి బెదిరింపు మెసేజ్‌ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.

వరుస బెదిరింపులు

కాగా, సల్మాన్‌ ఖాన్‌కు ఇటీవలే వరుస హత్య బెదిరింపులు వస్తున్నాయి. ప్రాణాలతో ఉండాలన్నా, బిష్ణోయ్‌ గ్యాంగ్‌తో ఉన్న వైరానికి ముగింపు పలకాలంటే రూ.5 కోట్లు ఇవ్వాలంటూ ముంబై ట్రాఫిక్‌ పోలీసుల వాట్సప్‌ నంబర్‌కు అక్టోబ‌ర్ 17 రాత్రి మెసేజ్‌ చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు జంషెడ్‌పూర్‌కు 24 ఏళ్ల కూరగాయల అమ్మకందారుడు షేక్‌ హుస్సేన్‌ షేక్‌ మౌసిన్‌ను అరెస్ట్‌ చేశారు. ఆ తర్వాత గత శుక్రవారం కూడా సల్మాన్‌కు ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. ఈ కేసులో నోయిడాకు చెందిన 20 ఏళ్ల వ్యక్తి మహ్మద్‌ తయ్యబ్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత గత నెల 30న కూడా మరోసారి ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. రూ.2 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ థ్రెట్ మెసేజ్ వచ్చింది. ముంబైలోని వర్లీ పోలీసులు.. గుర్తు తెలియ‌ని వ్యక్తిపై కేసు బుక్ చేసి విచార‌ణ చేప‌ట్టారు. వరుస బెదిరింపులు రావడంతో మహారాష్ట్ర ప్రభుత్వం సల్మాన్‌కు భద్రతను పెంచింది.

Advertisement

Next Story