స్లిమ్‌గా అవ్వాలని తినడం బంద్.. చివరకు ఎలా మారిందో చూడండి!

by Jakkula Mamatha |
స్లిమ్‌గా అవ్వాలని తినడం బంద్.. చివరకు ఎలా మారిందో చూడండి!
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ యువతి స్లిమ్‌గా అయ్యేందుకు ఆన్‌లైన్‌ను ఫాలో అవుతూ డైటింగ్ చేసింది. చివరికి తన ప్రాణాల మీదకే తెచ్చుకొంది. వివరాల్లోకి వెళితే.. కేరళ(Kerala)లోని కన్నూర్‌(Kannur)లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కన్నూర్‌కు చెందిన ఓ యువతి తన బరువును అదుపులో ఉంచుకోవాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో డైటింగ్ చేసేందుకు ఆన్‌లైన్‌(Online)ను ఫాలో అయింది. దీంతో ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం శ్రీ నంద తలస్సేరిలోని ఆసుపత్రిలో చేర్పించారు. కానీ.. పరిస్థితి విషమించి ఆమె ప్రాణాలు కోల్పోయింది.

బంధువులు తెలిపిన వివరాల మేరకు.. బరువు పెరుగుతాననే భయంతో ఆమె భోజనం మానేసి చాలా వ్యాయామం చేసేవారని చెబుతున్నారు. ఈ క్రమంలో ఆమె ద్రవ ఆహారం తీసుకుంటున్నట్లు, ఆకలి అంచున ఉందని తెలిపారు. మరణించిన బాలిక మట్టనూర్ పళస్సిరాజా NSS కళాశాలలో మొదటి సంవత్సరం గ్రాడ్యుయేషన్ చదువుతున్నట్లు తెలిపారు. వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇది అనోరెక్సియా నెర్వోసా అనే తినే రుగ్మత కావచ్చు. ఈ కేసులు కోవిడ్ అనంతర కాలంలో ఎక్కువగా కనిపించాయని తెలిపారు.

Next Story