J&K: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జమ్మూకశ్మీర్‌లో అప్రమత్తమైన భద్రతా బలగాలు

by S Gopi |
J&K: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జమ్మూకశ్మీర్‌లో అప్రమత్తమైన భద్రతా బలగాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: గత కొన్ని వారాలుగా జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాద దాడులు జరుగూన్నాయి. భారత బలగాలు అంతే తీవ్రంగా వారిని మట్టుబెడుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జమ్మూకశ్మీర్‌లో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. పటిష్టమైన భద్రతా చర్యల్లో భాగంగా భీంబర్ గలి, మంజకోటే సెక్టార్లలో భద్రతా బలగాలు వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఆదివారం తెల్లవారుజామున, జమ్మూకశ్మీర్‌లోని కిష్త్‌వర్ ఉగ్రవాదులతో కొద్దిసేపు కాల్పులు జరిగిన తరువాత భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయని పోలీసు అధికారులు తెలిపారు. అంతకుముందు శనివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఆర్మీ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. అనంత్‌నాగ్‌లో ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయిన హవల్దార్ దీపక్ కుమార్ యాదవ్, లాన్స్ నాయక్ ప్రవీణ్ శర్మలకు ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, భారత ఆర్మీలోని అన్ని ర్యాంక్‌ల అధికారులు ఆదివారం నివాళులర్పించారు. కాగా, కథువాలో ఆర్మీ కాన్వాయ్‌పై దాడి, దోడా, ఉధంపూర్‌లో ఎదురుకాల్పులు వంటి ఘటనల తర్వాత నుంచి జమ్మూలో ఇటీవలి నెలల్లో తీవ్రవాద దాడులు పెరిగాయి. ఈ ఏడాది జూలై 21 వరకు జరిగిన 11 ఉగ్రవాద సంబంధిత సంఘటనలు, 24 కౌంటర్ టెర్రర్ ఆపరేషన్లలో పౌరులు, భద్రతా సిబ్బందితో సహా 28 మంది మరణించారని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ లోక్‌సభకు తెలియజేసింది.

Advertisement

Next Story