వయనాడ్ లో ఆ 130 మంది ఎక్కడ??

by M.Rajitha |
వయనాడ్ లో ఆ 130 మంది ఎక్కడ??
X

దిశ, వెబ్ డెస్క్ :వయనాడ్ విషాదంలో రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. లభించిన మృతదేహాల్లో 200 మందిని గుర్తించగా, మిగతా వాటిని గుర్తించే పనిలో ఉన్నారు అధికారులు. అయితే ఇంకా జాడలేని 130 మంది ఎక్కడ అనేది అంతు చిక్కని ప్రశ్నగా మారింది. వీరికోసం చలియర్ నది, దాని సమీప అడవులలో ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. జూలై 30న కొండచరియలు విరిగి పడిన ఘటనలో గుర్తించని 51 మృత దేహాలకు డీఎన్ఏ టెస్ట్ ద్వారా వారిని గుర్తించనున్నారు. మరోవైపు ఆచూకీ లేకుండా పోయిన 130 మంది కోసం ఎన్డీఆర్ఎఫ్, పోలీస్, అగ్నిమాపక, అటవీశాఖలకు చెందిన మొత్తం 190 మంది సిబ్బంది వరదలు సంభవించిన ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. ఇప్పటికే ఈ ప్రాంతాలను ఒకసారి గాలించామని, ప్రస్తుతం నది, దాని దిగువ అటవీ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ నాడుస్తోందన్నారు ఏడీజీపీ అజిత్ కుమార్. కాగా సోమవారం సెర్చ్ ఆపరేషన్ లో కొన్ని శరీర భాగాలు లభించినట్టు స్థానిక మీడియా వెల్లడించింది.

Next Story

Most Viewed