Jammu Kashmir : కశ్మీర్ అసెంబ్లీకి సభ్యుల నామినేషన్‌‌.. పిటిషన్‌‌ను విచారించేందుకు ‘సుప్రీం’ నో

by Hajipasha |
Jammu Kashmir : కశ్మీర్ అసెంబ్లీకి సభ్యుల నామినేషన్‌‌.. పిటిషన్‌‌ను విచారించేందుకు ‘సుప్రీం’ నో
X

దిశ, నేషనల్ బ్యూరో : జమ్మూకశ్మీర్ అసెంబ్లీకి ఐదుగురు సభ్యులను నామినేట్ చేసేలా లెఫ్టినెంట్ గవర్నర్‌కు అధికారం కల్పించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది. ‘‘కశ్మీర్ అసెంబ్లీకి సభ్యులను లెఫ్టినెంట్ గవర్నర్ నామినేట్ చేస్తారో లేదో మాకైతే తెలియదు. మీరు దీనిపై స్థానిక హైకోర్టుకు వెళ్లండి. ప్రతీదీ నేరుగా సుప్రీంకోర్టుకు తీసుకురాలేరు’’ అని న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది.

జమ్మూకశ్మీర్‌కు చెందిన రవీందర్ కుమార్ శర్మ అనే వ్యక్తి ఈ పిటిషన్‌ను దాఖలు చేశాడు. ఆయన తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వి వాదనలు వినిపించారు. త్వరలోనే జమ్మూకశ్మీరులో కొత్త ప్రభుత్వం కొలువుతీరనున్న వేళ సుప్రీంకోర్టు తాజా ఆదేశం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Advertisement

Next Story

Most Viewed