- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఈసీల నియామకంపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు
న్యూఢిల్లీ: ఎన్నికల కమిషనర్ల నియామకంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమీషనర్‌లను ప్రధానమంత్రి, ప్రతిపక్ష నేత, భారత ప్రధాన న్యాయమూర్తితో కూడిన అత్యున్నత కమిటీ నియమించాలని ఆదేశించింది. సీబీఐ డైరెక్టర్‌ను ఎలా నియమిస్తారో ఆ విధంగానే ఎంపిక చేయాలని భారత సర్వోన్నత న్యాయస్థానం గురువారం ఆదేశించింది.
దీనికి సంబంధించి పార్లమెంటు చట్టం చేసే వరకు ఎన్నికల కమిషనర్ల నియామకం త్రిసభ్య కమిటీ చేపట్టాలని జస్టిస్ కేఎం జోసెఫ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. ఈసీల నియామాకానికి కొలిజీయం వంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలని దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.
ఒకవేళ ప్రతిపక్ష సభ్యుడు లేకపోతే విపక్షంలో మెజారిటీ ఉన్న పార్టీ సభ్యుడిని కమిటీలో చేర్చాలని సూచించింది. ప్రజల అభీష్టాన్ని ప్రతిబింబించేలా ఎన్నికల ప్రక్రియ స్వచ్ఛతను కాపాడుకోవడానికి అన్ని భాగస్వాములు కృషి చేస్తేనే ప్రజాస్వామ్యం విజయవంతమవుతుందని ధర్మాసనం పేర్కొంది. ఎన్నికల ప్రక్రియను మెరుగపరిచే ఏ చర్యనైనా కోర్టు పరిశీలనలోకి తీసుకుంటుందని అన్నారు. ప్రభుత్వం చట్ట ప్రకారం నడుచుకోవాలని తెలిపారు.
మరోవైపు సుప్రీంకోర్టు ఆదేశాలను ప్రతిపక్షాలు స్వాగతించాయి. సుప్రీంకోర్టు నిర్ణయం చాలా ముఖ్యమైనదని కాంగ్రెస్ నేత సుర్జేవాలా ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని బలహీనం చేయాలనుకునే బీజేపీ కుయుక్తులు పని చేయవని విమర్శించారు. సుప్రీంకోర్టు ఆదేశాలు ఈసీని సమర్థవంతంగా మారుస్తుందని టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ ట్వీట్ చేశారు.