1942లో జెండా అంటూ సెల‌బ్రిటీ ట్వీట్.. తిట్టిపోస్తున్న నెటిజ‌నులు?!!

by Sumithra |
1942లో జెండా అంటూ సెల‌బ్రిటీ ట్వీట్.. తిట్టిపోస్తున్న నెటిజ‌నులు?!!
X

దిశ‌, వెబ్‌డెస్క్ః హిందీ సినిమాలు తెలిసిన వారికి స‌తీష్ షా పరిచ‌యం అవ‌స‌రం లేదు. అయితే, ఆయ‌నిప్పుడు ఇంటర్నెట్‌లో చిత్కారాలు ఎదుర్కుంటున్నారు. దానికి కార‌ణం ఆయ‌న గ‌ర్వంగా చూపించిన జాతీయ జెండా! "క్విట్ ఇండియా ఉద్యమం-1942లో మా అమ్మకు లభించిన అదే తిరంగ ధ్వజ్" అని ట్విట్టర్‌లో ఫోటో పోస్ట్ చేయడంతో ఇదంతా ప్రారంభమైంది. అయితే నెటిజన్లు ఒక‌సారి ఆ జెండా ఎప్ప‌టిద‌నే వాస్తవాన్ని తనిఖీ చేసుకోవాల‌ని కోరారు. ఈ సంద‌ర్భంగా, స‌తీష్ షాకు నెటిజ‌నులు భారతీయ చరిత్ర పాఠాలు చెప్పడానికి సిద్ధప‌డ్డారు.

జెండా మధ్యలో అశోక్ చక్రం ఉంది. అయితే, 1942లో, భారత జెండా మధ్యలో చరఖా ఉండేది. 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత చరఖా స్థానంలో అశోక్ చక్ర వచ్చింది. "అయితే, ఈ జెండా 1947లో ఆమోదించబడింది. 1942లో ఉపయోగించిన జెండాలో చరఖా ఉంది!" ఒక వినియోగదారుడు వివ‌రించాడు. మరొకరు దాన్ని వ్యతిరేకించారు, "ఇది 1947లో స్వీకరించబడింది. అయితే ఇది అప్పటికే పింగళి వెంకయ్యచే 1921లో రూపొందించబడింది. కొంత వరకు ఉపయోగించబడింది."అని అన్నారు. మొత్తానికి చాలా మంది, "మాకు తెలిసినంత వ‌ర‌కూ 1947లో జెండాపై అశోక చక్రాన్ని స్వీకరించాము. 1942లో మీకు/అమ్మకు ఎలా వచ్చింది?" అని క‌డిగిపారేస్తున్నారు. షా అందరికీ క్షమాపణలు చెప్పాలని కొందరు భావించ‌గా.. "ఈ రోజుల్లో అబద్ధాలు చెప్పడం చాలా సులభం. అందులోనూ సెబ్రిటీలు దేశభక్తి పాయింట్లు సాధించడానికి ఆసక్తి చూపుతున్నారు అని అంటున్నారు. అయితే, ఈ వాదాల‌పై స‌తీష్ షా నుంచి ఎలాంటి స్పంద‌నా లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

Advertisement

Next Story

Most Viewed