ఆ ఆలయం కింద భారీ నిర్మాణ సంపద

by Hajipasha |
ఆ ఆలయం కింద భారీ నిర్మాణ సంపద
X

దిశ, నేషనల్ బ్యూరో : బుద్ధుడికి జ్ఞానోదయం అయిన ప్రదేశం బిహార్‌ రాష్ట్రంలోని బోధ్ గయ. బోధ్ గయలోని మహాబోధి ఆలయం కింద ప్రాచీన నిర్మాణ సంపద దాగి ఉందని తాజాగా నిర్వహించిన జియో స్పేషియల్ అధ్యయనంలో వెల్లడైంది. బిహార్ హెరిటేజ్ డెవలప్మెంట్ సొసైటీ (బీహెచ్‌డీఎస్), బ్రిటన్‌కు చెందిన కార్డిఫ్ యూనివర్సిటీ సంయుక్తంగా ఈ అధ్యయనాన్ని నిర్వహించాయి. మహాబోధి ఆలయ కాంప్లెక్సు కింద, దాని పరిసర ప్రాంతాల్లో ప్రాచీన నిర్మాణ సంపద అవశేషాలు ఉన్నాయని స్టడీలో తేలింది. 7వ శతాబ్దపు చైనా బౌద్ధ సన్యాసి జువాన్ జాంగ్ చేసిన పలు రచనల్లో మహాబోధి ఆలయం గురించి ప్రత్యేక వర్ణనలు ఉన్నాయి.

బెంగళూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీస్‌లో బోధనా సిబ్బందిగా సేవలు అందిస్తున్న ఎం.బి.రజిని జువాన్ జాంగ్ రచనల ప్రకారం తన అధ్యయనం మొదలుపెట్టారు. ఈక్రమంలో మహాబోధి ఆలయం, పరిసర ప్రాంతాల శాటిలైట్ ఇమేజ్‌లను సేకరించి ఆమె స్టడీ చేశారు. ఆలయానికి ఉత్తరాన, భూగర్భం కింద అనేక నిర్మాణాలు ఉన్నట్లు శాటిలైట్ల చిత్రాల విశ్లేషణలో రజిని గుర్తించారు. నిరంజన నదికి తూర్పున ఉన్న మహాబోధి కాంప్లెక్సు కింది భాగంలో స్మారక చిహ్నాలు, పురావస్తు అవశేషాలు, సుజాత స్థూపం ఉండొచ్చని ఆమె అంచనా వేశారు. హర్షవర్ధన రాజుల పాలనా కాలంలో బౌద్ధ గ్రంథాలను పొందేందుకు చైనా నుంచి భారత్‌కు జువాన్ జాంగ్ వచ్చాడు. తర్వాతి కాలంలో ఇతడి రచనల ద్వారా చైనాలో బౌద్ధం బలపడింది.

Advertisement

Next Story

Most Viewed