రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు సంజయ్ రౌత్ మద్దతు

by Harish |
రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు సంజయ్ రౌత్ మద్దతు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇటీవల పార్లమెంట్‌లో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌‌లపై ధ్వజమెత్తగా, ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపాయి. అయితే తాజాగా శివసేన (యూబీటీ) నాయకుడు సంజయ్ రౌత్, రాహుల్ వ్యాఖ్యలను సమర్ధించారు. మంగళవారం మాట్లాడిన ఆయన, రాహుల్ గాంధీ, హిందువులు, హిందూ సమాజం గురించి తప్పుగా మాట్లాడలేదు. మోడీ హిందుత్వ కాదని, బీజేపీ మొత్తం హిందూ సమాజం కాదని ఆయన అన్నారు. హిందుత్వ అనేది చాలా విస్తృతమైన పదం, భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి ఇది అర్థం కాదు, దీనిని వారు మరోసారి వినాలని ఆయన కాషాయ పార్టీపై మండిపడ్డారు. అలాగే, హిందుత్వం అంటే ద్వేషాన్ని వ్యాప్తి చేయడం కాదు, ఇండియా కూటమి నాయకులు బీజేపీ "నకిలీ హిందుత్వ" సిద్ధాంతాన్ని సమర్థించరని ఈ సందర్భంగా సంజయ్ రౌత్ చెప్పారు.

సోమవారం జరిగిన పార్లమెంట్ సమావేంలో రాహుల్‌ గాంధీ బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌‌లపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘‘తమను తాము హిందువులుగా చెప్పుకునే బీజేపీ, ఆర్ఎస్ఎస్‌ నేతలు నిత్యం హింస, విద్వేషం గురించే మాట్లాడుతుంటారు. వాళ్లు నిజమైన హిందువులు కాదు’’ అని రాహుల్‌ కామెంట్ చేశారు. ఇదిలా ఉంటే, మహారాష్ట్ర పరిస్థితి గురించి మాట్లాడిన సంజయ్ రౌత్, శివసేన హిందువులను విడిచిపెడుతోందని బీజేపీ తరచూ ఆరోపిస్తోంది, అయితే తాను అలా చేయలేదని పేర్కొన్నారు. నేను హిందుత్వను వీడలేదు. నేను భారతీయ జనతా పార్టీని విడిచిపెట్టాను అని రౌత్ చెప్పారు, హిందుత్వం అనేది సంస్కృతి, సంప్రదాయాల్లో భాగమని, విద్వేషాన్ని వ్యాప్తి చేసే సాధనం కాదని ఆయన అన్నారు.

Advertisement

Next Story