- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
త్రివిధ దళాల సెల్యూట్ స్టైల్ వేరువేరుగా.. ఎందుకో తెలుసా..?
దిశ, వెబ్ డెస్క్ : ఆర్మీ ఫోర్స్, నేవీ ఫోర్స్, ఎయిర్ ఫోర్స్ మూడింటి కలియికే భారత త్రివిధ దళాలు. మీరెప్పుడైన గమనించారో లేదో.. ఒక్కో ఫోర్స్ ఒక్కో స్టైల్లో సెల్యూట్ చేస్తుంటారు. అలా ఎందుకు చేస్తారో సాధారణంగా తెలియపోవచ్చు. ఇప్పుడు వాటి గురించి మనం తెలుసుకుందాం. ఇండియన్ ఆర్మీ ఫోర్స్ వారు సెల్యూట్ చేస్తే.. పూర్తిగా అరచేయి ఎదుటి వారికి కనపడేలా, నుదురు లేదా కనుబొమ్మ తాకేలా తమ ఉన్నతాధికారులు, ప్రధానులు, గవర్నర్లకు సెల్యూట్ చేస్తారు. దీనిని వెపన్ హ్యాండ్ సెల్యూట్ అంటారు. అందులో అర్థం ఏంటంటే.. ఎదుటి వారిని గౌరవిస్తున్నాను. నాలో ఎలాంటి దురుద్దేశం లేదు. నా ఒంటి మీద ఉన్న యునీఫాం, సెల్యూట్, నిశ్చలమైన మనసుతో ఉన్నానని ఖాళీ చేతితో సెల్యూట్ చేస్తున్నాని అర్థం.
అదేవిధంగా ఇండియన్ నేవీ ఫోర్స్ సెల్యూట్ మరో రకంగా ఉంటుంది. ఆ సెల్యూట్ లో ఉన్న గొప్పతనం తెలిస్తే ప్రతిఒక్కరూ గర్వపడతారు. వారి సెల్యూట్ లో అరచేతిని నేల వైపు వంచి మధ్య వేలును నుదురుపై ఉంచి, 90 డిగ్రీలో కోణంలో సెల్యూట్ చేస్తారు. అలా చేయడంలో ఆంతర్యం ఏంటంటే.. నేవీ సైనికులు ఎప్పుడూ షిప్ లలో ఉంటారు. వారు కొన్ని సందర్భాల్లో పనులు చేస్తున్నప్పుడు చేతికి ఆయిల్, ధుమ్ము ధూళి అంటుకుంటుంది. ఆ చేయితో పెద్ద వాళ్లకు సెల్యూట్ చేయడం కరెక్ట్ కాదని అరచేయి కనిపించకుండా కిందికి వంచి 90 డిగ్రీ కోణంలో సెల్యూట్ చేస్తారు.
ఇక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సెల్యూట్ విభిన్నమైనది. అరచేయి నింగీ, నేలకు మధ్యన ఉంచుతూ, మధ్య వేలు కనుబొమ్మను తాకేలా 45 డిగ్రీల కోణంలో సెల్యూట్ చేస్తారు. అందులో అర్థం ఏంటంటే నింగికి, నేలకు మధ్య ఉండి దేశ భద్రతను పర్యవేక్షిస్తామని అర్థమట. ఇన్ని తెలుసుకున్న తరువాత త్రివిధ దళాల ఔన్నత్యం బహిర్గతమవుతోంది. దేశం కోసం వారు పడే తపన అనన్యసామాన్యమని అర్థం అవుతోంది.